AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటితో కురిసిన కాసుల వర్షం.. కోటీశ్వరుల పాలకొండ కథ తెలిస్తే ఔరా అనాల్సిందే!

సాధారణంగా గ్రామాలు వ్యవసాయంపై ఆధారపడతాయి. కానీ, ఇక్కడ ఒక గ్రామం మాత్రం నీటిని విక్రయించి కోటీశ్వరుల గ్రామంగా అవతరించింది. నగరంలో పెరుగుతున్న నీటి ఎద్దడిని ఈ గ్రామస్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇక్కడి ప్రతి ఇంటి ముందు కనీసం ఒకటి లేదా రెండు వాటర్ ట్యాంకర్లు కనిపిస్తాయి. తమ పొలాల్లోని బోరు బావుల ద్వారా లభించే నీటిని ట్యాంకర్ల ద్వారా నగరంలోని హోటళ్లు, పరిశ్రమలు, నివాస సముదాయాలకు సరఫరా చేస్తూ గ్రామస్థులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు సామాన్య జీవితం గడిపిన వారు నేడు విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. నీరే ఇక్కడ ద్రవ బంగారంగా మారింది. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడో చెప్పనే లేదు కదా..? పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

నీటితో కురిసిన కాసుల వర్షం.. కోటీశ్వరుల పాలకొండ కథ తెలిస్తే ఔరా అనాల్సిందే!
Village Selling WaterImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2026 | 4:33 PM

Share

సాధారణంగా గ్రామాలు వ్యవసాయంపై ఆధారపడతాయి. కానీ, ఇక్కడ ఒక గ్రామం మాత్రం నీటిని విక్రయించి కోటీశ్వరుల గ్రామంగా అవతరించింది. నగరంలో పెరుగుతున్న నీటి ఎద్దడిని ఈ గ్రామస్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇక్కడి ప్రతి ఇంటి ముందు కనీసం ఒకటి లేదా రెండు వాటర్ ట్యాంకర్లు కనిపిస్తాయి. తమ పొలాల్లోని బోరు బావుల ద్వారా లభించే నీటిని ట్యాంకర్ల ద్వారా నగరంలోని హోటళ్లు, పరిశ్రమలు, నివాస సముదాయాలకు సరఫరా చేస్తూ గ్రామస్థులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు సామాన్య జీవితం గడిపిన వారు నేడు విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. నీరే ఇక్కడ ద్రవ బంగారంగా మారింది. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడో చెప్పనే లేదు కదా..? పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

చాలామంది వ్యాపారవేత్తలు బంగారం లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి ధనవంతులు అవుతారు. కానీ, ఇండోర్‌కు సమీపంలోని పాలకొండ గ్రామ ప్రజలు మాత్రం కేవలం నీటిని అమ్మి లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. నీటి విక్రయాలతో ఒకప్పుడు సామాన్య జీవితం గడిపిన వారు నేడు విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. నీరే ఇక్కడ ద్రవ బంగారంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాకు చెందిన పాలకొండ గ్రామం మాత్రం నీటిని విక్రయించి కోటీశ్వరుల గ్రామంగా అవతరించింది. ఇండోర్ నగరం వేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల కారణంగా నగరంలో నీటి కొరత తీవ్రమైంది. ఇదే సమయంలో, పాలకొండ గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న గ్రామస్థులు, తమ పొలాల్లో బోర్లు వేసి, ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా నగరానికి తరలించడం ప్రారంభించారు. ఈ గ్రామంలో అడుగుపెడితే ఎటు చూసినా వాటర్ ట్యాంకర్లే కనిపిస్తాయి. దాదాపు ప్రతి కుటుంబానికి స్వంతంగా ట్యాంకర్లు ఉన్నాయి. గృహ అవసరాల నుండి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు వీరు నీటిని సరఫరా చేస్తున్నారు. వ్యవసాయం చేయడం కంటే నీటి వ్యాపారమే అత్యధిక లాభాలను తెచ్చిపెడుతుండటంతో, యువత కూడా ఈ రంగం వైపు ఆకర్షితులవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు పూరి గుడిసెలు, పెంకుటిళ్లతో ఉన్న ఈ గ్రామం ఇప్పుడు అత్యాధునిక భవనాలతో కళకళలాడుతోంది. నీటి అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయంతో గ్రామస్థులు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేశారు. ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు గడచిన పదేళ్లలో ఊహించని విధంగా మారిపోయాయి. గ్రామ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకర్ల మీదనే ఆధారపడి ఉంది.

అయితే, నాణేనికి మరో పక్క ఉన్నట్లుగా, ఈ భారీ నీటి వినియోగం పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. నిరంతరం భూమి నుండి నీటిని తోడేస్తుండటం వల్ల భూగర్భ జల మట్టం క్రమంగా పడిపోతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం పాలకొండ గ్రామస్థులకు నీరే కల్పవృక్షంగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్