Dasara Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు

తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వాలు దసరా సెలవులు కూడా ప్రకటించాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ప్రతీయేట దసరా పండుగకు స్వస్థలాలకు వెళుతుంటారు. ఈసారి కూడా సొంతూర్లకు వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటుంటారు. అయితే పండగ నేపథ్యంలో నెల రోజులు ముందుగానే రిజర్వేషన్‌ భోగీలలోని సీట్లన్నీ..

Dasara Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు
Dasara Special Trains
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 17, 2023 | 7:06 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వాలు దసరా సెలవులు కూడా ప్రకటించాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ప్రతీయేట దసరా పండుగకు స్వస్థలాలకు వెళుతుంటారు. ఈసారి కూడా సొంతూర్లకు వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటుంటారు. అయితే పండగ నేపథ్యంలో నెల రోజులు ముందుగానే రిజర్వేషన్‌ భోగీలలోని సీట్లన్నీ బుక్‌ అయ్యిపోతాయి. దీంతో పండుగకు ఇళ్లకు పోయేవాల్లకు సీట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 620 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దసరా రద్దీని నివారించేందుకు ఈ మేరకు ఈ ప్రత్యేక రైళ్లను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దీంతో తెలంగాణలోని కాచిగూడ, లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్ సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, రాజమండ్రి సహా పలు ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు అధికంగా సాగిస్తుంటారు. దీంతో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తన ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే వివరించింది. అక్టోబర్ 20 వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య కాకినాడ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, పిడుగురాళ్ల, రెండు రూట్లలో సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, నల్గొండ, మిర్యాలగూడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మధ్య నడుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు ప్రయాణికుల అభ్యర్థనల మేరకు ఏపీకి ప్రత్యేక బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ (JBS) మీదుగా విజయవాడకు టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ కాకుండా జేబీఎస్ ద్వారా నడపాలని BHEL నిర్ణయించింది. అక్టోబర్ 18 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!