Watch Video: అరడుగుల బుల్లెట్ హరీశ్.. సిద్ధిపేట సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Watch Video: అరడుగుల బుల్లెట్ హరీశ్.. సిద్ధిపేట సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Oct 17, 2023 | 7:36 PM

Telangana Assembly Elections 2023: ఇసుక పోస్తే రాలనంత జనం అనడం వింటుంటామని.. సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హరీశ్ రావు సిద్ధిపేటను అద్భుతంగా అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. లక్ష పైచిలుకు మెజార్టీతో సిద్ధిపేట సరికొత్త రికార్డు సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధిపేటలో జరిగిన సభలో మాట్లాడిన సీఎం..

మంత్రి హరీశ్ రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిద్ధిపేట సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన బహిరంగ సభలో మంగళవారం పాల్గొని మాట్లాడిన సీఎం కేసీఆర్.. సభకు భారీ ఎత్తున జనం తరలిరావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఇసుక పోస్తే రాలనంత జనం అనడం వింటుంటామని.. సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో ఇప్పుడు కళ్లారా చూస్తున్నామన్నారు. హరీశ్ రావు సిద్ధిపేటను అద్భుతంగా అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. లక్ష పైచిలుకు మెజార్టీతో సిద్ధిపేట సరికొత్త రికార్డు సృష్టించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Published on: Oct 17, 2023 07:09 PM