AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మునుగోడులో టీఆర్ఎస్ కే సీపీఐ మద్దతు.. కాసేపట్లో అధికారిక ప్రకటన

మునుగొడులో గతంలో బలంగా ఉన్న సీపీఐ పార్టీ ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తుందా.. లేదా ఎవరికైనా మద్దతిస్తుందా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. మునుగోడు బైపోల్ జరిగితే తాము టీఆర్ ఎస్ పార్టీకే మద్దతివ్వాలని..

Telangana: మునుగోడులో టీఆర్ఎస్ కే సీపీఐ మద్దతు.. కాసేపట్లో అధికారిక ప్రకటన
Cpi
Amarnadh Daneti
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 20, 2022 | 4:00 PM

Share

Telangana: ఎమ్మెల్యే పదవికి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో త్వరలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో..తెలంగాణలో ప్రధాన పార్టీలన్ని మునుగోడు పై ఫోకస్ పెట్టాయి. ఇంకా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వకముందే పార్టీలన్ని గెలుపుకోసం ఉన్న అవకాశాలను వాడుకునేందుకు సిద్ధమయ్యాయి. దీంతో మునుగొడులో గతంలో బలంగా ఉన్న సీపీఐ పార్టీ ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తుందా.. లేదా ఎవరికైనా మద్దతిస్తుందా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. మునుగోడు బైపోల్ జరిగితే తాము టీఆర్ ఎస్ పార్టీకే మద్దతివ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈరెండు పార్టీల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో టీఆర్ ఎస్ కు మద్దతివ్వాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిర్ణయించారు. ఈవిషయాన్ని అధికారికంగా మద్యాహ్నం 12 గంటలకు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మీడియాకు వెల్లడించనున్నారు.

మునుగోడులో 1967 నుంచి ఇప్పటివరకు 12 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగితే సీపీఐ అభ్యర్థి 5 సార్లు విజయం సాధించారు. 1985 నుంచి 1999 వరకు సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు పల్లా వెంకటరెడ్డి సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2009 నుంచి 2014 వరకు ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈనియోజకవర్గంలో 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు సీపీఐ పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కమ్యూనిస్టులకు ఈనియోజకవర్గంలో కొంతబలం ఉండటంటో ఉప ఎన్నిక జరిగితే కమ్యూనిస్టులు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే గతంలోనూ ఉప ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులు టీఆర్ ఎస్ కు మద్దతుగా నిలిచిన సందర్భాలున్నాయి. ఈనేపథ్యంలో నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి సీపీఐ నాయకులతో చర్చించడం ద్వారా.. వారి మద్దతు పొందగలిగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి