AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: పోలీసుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న భార్యాభర్తలను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమంటూ నమ్మిస్తూ పలువురి నుంచి లక్షల రూపాయలు కాజేసిన శ్రీధర్, నందిని పోలీసులకు పట్టుబడ్డారు.

ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
Fake Police
Balaraju Goud
|

Updated on: Aug 14, 2026 | 9:41 PM

Share

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: పోలీసుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న భార్యాభర్తలను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమంటూ నమ్మిస్తూ పలువురి నుంచి లక్షల రూపాయలు కాజేసిన శ్రీధర్, నందిని పోలీసులకు పట్టుబడ్డారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తాము పోలీసు శాఖలో ఇంటెలిజెన్స్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూ పలువురిని నమ్మించేవారు. ఇందుకోసం నకిలీ పోలీసు గుర్తింపు కార్డులను ఉపయోగించడంతో పాటు, ప్రముఖ వ్యక్తులతో కలిసి దిగినట్లుగా కనిపించే మార్ఫింగ్ ఫొటోలను చూపించేవారు. తమకు ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని చెబుతూ బాధితులను మభ్యపెట్టి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కొంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ.. నిందితుల మాటలు, వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితుల ఫిర్యాదుల మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నిందితులు నకిలీ పోలీసులుగా చలామణి అవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

నకిలీ గుర్తింపు కార్డులు, మార్ఫింగ్ ఫొటోల ఆధారంగా పోలీసు అధికారులమంటూ ప్రజలను మోసం చేసిన శ్రీధర్, నందినిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల పేరుతో ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us