Telangana: అన్నదాతలు బీఅలర్ట్.. మార్కెట్‌లో నకిలీ విత్తనాలు.. భారీ రాకెట్ గుట్టురట్టు
Warangal News in Telugu: అన్నదాతలు బీ అలర్ట్.. వ్యవసాయ సీజన్ మొదలవుతుందంటే చాలు.. నకిలీ విత్తన మాఫియాలు రెడీ ఐపోతాయి. పనికిమాలిన విత్తనాలను తక్కువ ధరకు కట్టబెట్టి రైతుల్ని నిండా ముంచే ముఠాలు దూకుడు పెంచేస్తాయి.
Warangal News in Telugu: అన్నదాతలు బీ అలర్ట్.. వ్యవసాయ సీజన్ మొదలవుతుందంటే చాలు.. నకిలీ విత్తన మాఫియాలు రెడీ ఐపోతాయి. పనికిమాలిన విత్తనాలను తక్కువ ధరకు కట్టబెట్టి రైతుల్ని నిండా ముంచే ముఠాలు దూకుడు పెంచేస్తాయి. ఇటువంటి నకిలీగాళ్ల భారీ సిండికేట్ ఆట కట్టించారు వరంగల్ పోలీసులు. ఇక్కడ తీగ లాగితే నాలుగు రాష్ట్రాల్లో డొంక కదిలింది. వరంగల్‌లో భారీ స్థాయిలో నడుస్తున్న నకిలీ విత్తనాల రాకెట్ బైటపడింది. వరంగల్ పోలీసులు- వ్యవసాయ శాఖ అధికారులు-టాస్క్‌ఫోర్స్ కలిసి చేసిన ఈ జాయింట్ ఆపరేషన్లో ఏకంగా 2కోట్ల 11 లక్షల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. ప్రధాన నిందితుడు పాండుతో పాటు 15 మంది వ్యాపారులు, తయారీదారుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
గుజరాత్‌కు చెందిన ఒక లైసెన్స్‌డ్ కంపెనీ పేరు మీద కర్ణాటకలో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠా ఇది. వీళ్లకు కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంద్రప్రదేశ్.. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఉంది. రకరకాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పేరు మీద, బ్రాండెడ్ కంపెనీల లోగోలతో దర్జాగా విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్‌లో దొరికిన 30 కిలోల లూజ్ సీడ్స్ ఆధారంగా ఈ భారీ రాకెట్ గుట్టు రట్టయింది.
రుషి సీడ్స్, శ్రీ గణేష్ సీడ్స్ పేర్లతో వచ్చేవన్నీ నకిలీ పత్తి విత్తనాలని, వీటిని కొనవద్దని రైతుల్ని అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం కూడా ఈ నకిలీ విత్తనాల తయారీల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం ఆదేశాల మేరకు విత్తన మాఫియా ముఠాలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదవుతున్నాయి.
ఖరీప్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్నదాతలు నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..