Hyderabad: హైదరాబాద్‌లో వెలుగు చూసిన సంచలన ఘటన.. యువతి జీవితాన్ని నాశనం చేసిన 2 వేలు..
ఓ యువతి అవసరాన్ని అవకాశంగా తీసుకొని లైంగిక దోపిడీకి పాల్పడిన దారుణమైన ఘటన హైదరబాద్ నడిబొడ్డున జరిగింది. స్నేహితుడిని నమ్మి నట్టేట్లో మునిగిన హైదరాబాద్‌కి చెందిన ఓ యువతి ఇప్పుడు లబోదిబోమంటోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ యువతి అవసరాన్ని అవకాశంగా తీసుకొని లైంగిక దోపిడీకి పాల్పడిన దారుణమైన ఘటన హైదరబాద్ నడిబొడ్డున జరిగింది. స్నేహితుడిని నమ్మి నట్టేట్లో మునిగిన హైదరాబాద్‌కి చెందిన ఓ యువతి ఇప్పుడు లబోదిబోమంటోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కి చెందిన యువతికి.. చెన్నైకి చెందిన పూర్ణేష్ యాదవ్‌కి.. 7 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమ దాకా వెళ్ళింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇటీవల తనకు డబ్బులు అవసరం ఉన్నాయంటూ చెన్నైలోని బాయ్‌ఫ్రెండ్ పూర్ణేష్ కోరడంతో.. ఆ యువతి తన స్నేహితుడైన అస్లాంను ఆశ్రయించింది. ఇదే అదనుగా భావించిన అస్లాం.. తన దగ్గర డబ్బుల్లేవనీ, అయితే తన స్నేహితుడు సాయిచరణ్ ఎంత కావాలంటే అంత డబ్బు నీకు సమకూర్చగలడనీ చెప్పాడు. అయితే అతనితో ఒకరోజంతా గడిపాలంటూ కండిషన్ పెట్టాడు అస్లాం.
బాయ్‌ఫ్రెండ్ అడిగిన డబ్బులు సమకూర్చేందుకు తన స్నేహితుడు అస్లాం కండిషన్‌ని అంగీకరించి గతనెలలో నారాయణగూడలోని సిల్వర్ ఓక్ ఓయో రూమ్‌లో సాయి అనే యువకుడిని కలిసేందుకు వెళ్ళింది బాధిత యువతి. అప్పటికే పక్కా ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న అస్లాం.. సాయితో ఆ యువతి కలిసి ఉండగా న్యూడ్ వీడియోలు తీసి, బెదిరించడం మొదలుపెట్టాడు.
తను అడిగినప్పుడల్లా లాడ్జికి రావాలని బెదిరించాడు అస్లాం. అంతేకాదు.. చెప్పినట్టు చేయకపోతే సాయితో కలిసి ఉన్న న్యూడ్ ఫొటోలను యువతి బాయ్ ఫ్రెండ్‌కి పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. మరోవైపు యువతి నగ్న వీడియోలు బాయ్ ఫ్రెండ్ పూర్ణేష్ యాదవ్ కంటబడడంతో అతను కూడా యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. యువతి బంధువులకు పంపుతానంటూ బెదిరిస్తుండడంతో బాధితురాలు నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అస్లాం సహా మరో యువకుడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
తన బాయ్ ఫ్రెండ్ అడిగిన 2 వేల కోసం యువతి పూర్తిగా మోసపోయిందన్నారు నారాయణగూడ పోలీసులు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..