Bandi Sanjay: ఎవరి మానసిక స్థితి ఏంటో ప్రజలకు తెలుసు.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మద్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఒకరి మానసిక స్థితిపై మరొకరు కామెంట్ చేసుకున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ పాలన తీరును తప్పుపట్టారు బండి సంజయ్. రాజకీయాలు, పాలన వేరు వేరుగా ఉండాలని.. సీఎం కేసీఆర్ రెండింటిని కలిసి చూస్తున్నారని..

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ మునిగిపోయే నావ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి తిరిగి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి మానసిక స్థితి ఏంటో ప్రజలకు తెలుసన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని.. కాంగ్రెస్ మానసిక పరిస్థితి చూసే ప్రజలు అక్కడ ఓట్లు వేయలేదన్నారు. మునిగిపోయే నావాలోకి వెళ్తాము అంటే తాము అస్సలు అపామన్నారు. బీజేపీ నుంచి వెళ్లేవారు ఎవరూ లేరని అన్నారు బండి సంజయ్.
మరోవైపు రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కామెంట్ చేశారు బండి సంజయ్. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఎవరు వెళ్లిన అపాయింట్ మెంట్ ఇవ్వరని.. అదే మంచి ఆలోచనలతో వెళ్తే ఏ రాజకీయ పార్టీ నేతలు అయినా కలిసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ పార్టీ అగ్ర నాయకులు కూడా సామన్యులకు అపాయింట్మెంట్ ఇస్తారని.. అదే తెలంగాణ సీఎం అవకాశం ఎందుకు ఇవ్వరూ.. అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గత మూడేళ్లలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారా..? ఏ సభలో మాట్లాడినా విమర్శలు తప్పా ఏమీ ఉండటం లేదని అన్నారు బండి సంజయ్.
దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు ఎక్కడైనా పాల్గొన్నారా.. ? దశాబ్ది ఉత్సవాలు అంటున్నారు…ఇంకా తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తి కాలేదని.. అప్పుడే దశాబ్ది ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
