AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంత అభిమానం ఏంటి సామి.. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్న యువకుడు..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండ గ్రామానికి చెందిన భూక్య గణేష్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అంటే అభిమానం. ఆ అభిమానం ఏ స్థాయికి వెళ్లిందంటే.. తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ముహూర్తం పెట్టుకుంటానని చెబుతున్నాడు. బంధువులు ఎంత చెప్పినా వినకుండా భీష్మించి కూర్చున్నాడు.

Viral: ఇంత అభిమానం ఏంటి సామి.. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్న యువకుడు..
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2025 | 10:21 AM

Share

సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని ఓ యువ కాంగ్రెస్ కార్యకర్త భీష్మించి కూర్చున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటా.. లేదంటే పెళ్లి పీఠలెక్కను.. అంటూ ఓ యువకుడు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించడం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండ గ్రామానికి చెందిన భూక్య గణేష్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అంటే అభిమానం. ఆ అభిమానం ఏ స్థాయికి వెళ్లిందంటే.. తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ముహూర్తం పెట్టుకుంటానని చెబుతున్నాడు. బంధువులు ఎంత చెప్పినా వినకుండా భీష్మించి కూర్చున్నాడు. ముఖ్యమంత్రి టైం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనని మొండికేశాడు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా తన పెళ్లికి హాజరయ్యేలా చూడాలని కోరుతూ.. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్‌కు వినతి పత్రం అందించాడు.

భూక్య గణేష్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అమితమైన అభిమానం. ఈ నేపథ్యంలోనే తన పెళ్లికి రేవంత్ రెడ్డి హాజరుకావాలని కోరుతున్నాడు.. వాస్తవానికి గణేష్ మార్చి 6వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్లతో పెళ్లి కుదుర్చుకున్నాడు. పెళ్లి ముహూర్తం పెట్టుకోవలసి ఉంది. కానీ గణేష్ తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైతేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని చెబుతున్నాడు.. ఆయనకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే తన ముహూర్తం పెట్టుకుంటానని ఇదే విషయాన్ని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కు చెప్పాడు.

వీడియో చూడండి..

రాజకీయ నాయకులకు అభిమానులు, అనుచరులు ఉండడం కామన్‌. కానీ ఆ అభిమానం హద్దులో ఉంటే అందరికీ శ్రేయస్కరమంటున్నారు స్థానికులు. అయితే.. కాంగ్రెస్ యువ కార్యకర్త ఆహ్వానంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..