AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telananga: ముగ్గురు బీసి లీడర్లు తలోదారి.. లీడర్ల తీరుతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ క్యాడ‌ర్లో క‌న్ఫ్యూజ‌న్

Telangana Politics: రాజకీయంగా అది కీలక నియోజకవర్గం. అలాంటి చోట కాంగ్రెస్‌లో బీసీ వార్‌ నడుస్తోంది. ముగ్గురు ముఖ్య నాయకుల మధ్య పొసగని పరిస్థితి. సమన్వయమే పెద్ద లోపంగా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం..? ఎవరా నాయకులు? లెట్స్‌ వాచ్‌..!

Telananga: ముగ్గురు బీసి లీడర్లు తలోదారి.. లీడర్ల తీరుతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ క్యాడ‌ర్లో క‌న్ఫ్యూజ‌న్
Congress Leed
Sanjay Kasula
|

Updated on: Jun 12, 2023 | 6:02 PM

Share

Nizamabad Urban: నిజామాబాద్ అర్బన్‌ కాంగ్రెస్ లో ఇప్పుడు మూడు ముక్కలాట నడుస్తోంది. ఒక‌ప్పుడు డీఎస్ లాంటి నేతలు ఏక ఛత్రాధిపత్యం వహించిన ఈ నియోజకవర్గం.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. టికెట్ కోసం పోటా పోటీ రాజకీయాలతో పాటు, స‌య‌న్వయ లోపం ముగ్గురు కాంగ్రెస్‌ లీడ‌ర్లను దూరం చేస్తోంది..కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నా నిజామాబాద్ అర్బన్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి చిన్న చిన్న స‌మ‌స్యలు ఇప్పుడు పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతున్నాయనేది టాక్‌. నిజామాబాద్ అర్బన్‌ లో కాంగ్రెస్ కు ప‌ట్టుంది…మైనారీటిల‌తో పాటు బీసీల‌లో పార్టీ క్యాడ‌ర్ బలంగా ఉంది. దీంతో అధిష్టానం బీసి నేత‌కు టికెట్ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట… ఆ విష‌యం తెలిసిన ముగ్గురు బీసీ లీడ‌ర్లు ఎవ‌రి గ్రూప్ వాళ్లు చేసుకొని రాజ‌కీయం చేస్తున్నారు…దీంతో పార్టీకి న‌ష్టం అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా ఎవ‌రూ వినడం లేదన్నటి కేడర్‌ మాట.

నిజామాబాద్ అర్బన్ లో పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశ వేణు, మాజీ మేయ‌ర్ ధర్మపురి సంజ‌య్ ముగ్గురూ బీసీ సామ‌జిక వ‌ర్గం. వారే …వీరిలో మ‌హేష్ కుమార్ గౌడ్ గ‌తంలో ఇక్కడి నుంచి పోటి చేసి ఓడిపోయారు. మాజీ మేయ‌ర్ సంజ‌య్ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో మహేష్‌ యాక్టివ్‌ అయ్యారు. అర్బన్ సీటు తనదే అంటూ ప్రచారం మొద‌లు పెట్టారు ఈ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. సంజ‌య్ సైతం అర్బన్ సీటుపై ఉడుంపట్టు పడుతున్నట్టు సమాచారం.

బీసీ వార్ లో టికెట్ సంజ‌య్ కి, త‌న‌కి కాకుంటే ఇంకో పేరును ప్రప్రోజ్ చేసార‌ట. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్… సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నా కేశ వేణు అయితే త‌మకు ఎలాంటి.. ఇబ్బంది ఉండ‌దని ప్రపోజ‌ల్ పెట్టినట్టు తెలుస్తోంది…వేణుకు డీఎస్ ఫ్యామీలితో పాటు.. మ‌హేష్‌తో సంబంధాలు ఉండటంతో ప్లస్‌ అవుతుందని లెక్క లేస్తున్నారు… జిల్లా కాంగ్రెస్ పార్టీ.. కూడా కేశ వేణు పేరును ప్రతిపాదించింద‌ట..

మ‌హేష్ కుమార్ గౌడ్ ఆర్మూరు నుండి పోటి చేసే ఆలోచ‌న‌లో ఉండటంతో నిజామాబాద్‌ అర్బన్ లో సంజ‌య్ తో పడక కేశ వేణును స‌పోర్ట్ చేస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే క్యాడ‌ర్ కు మ‌హేష్ కుమార్ గౌడ్ సిగ్నల్స్ ఇచ్చేసార‌ట…మాజీ మంత్రి సుద‌ర్శన్ రెడ్డి ధర్మపురి సంజ‌య్ ను ఎంక‌రేజ్ చేస్తుంటే… మ‌హేష్ మాత్రం కేశ వేణు కు అన్ కండిష‌న‌ల్ స‌పోర్ట్ ఇస్తున్నారట.

మొత్తానికి క్యాడ‌ర్ లో క‌న్ ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తున్న ఈ స‌మ‌స్యతొంద‌ర‌గా స‌మ‌సి పోవాల‌ని… ముగ్గురు క‌లిసివేదిక పంచుకుంటే చూడాల‌ని ముచ్చట ప‌డుతున్నార‌ట కాంగ్రెస్ కార్యక‌ర్తలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం