Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం.. కీలక నిర్ణయాలు

నాలుగు గంటల పాటు జరిగిన టీపీసీసీ కార్యవర్గ భేటీ మూడు తీర్మానాలు తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వారికి గుర్తింపు.. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ చేస్తోన్న విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌.

గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం.. కీలక నిర్ణయాలు
Tpcc Meeting
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2024 | 9:25 PM

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దీపా దాస్‌మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులతో పాటు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి లోక్‌సభ ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్‌. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోనల్‌ వ్యవస్థను సమీక్షించేందుకు ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ కమిషన్‌ రద్దు చేసి, త్వరలో కొత్త కమిషన్‌ నియమిస్తామన్నారు సీఎం రేవంత్‌. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా గడవక ముందే.. కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్ పుస్తకాలు విడుదల చేయడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు.

జనవరి 8, 9న పార్లమెంట్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవంత్‌ చర్చించనున్నారు. 11,12,13న పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశమవుతారు. ఆ తర్వాత 14 నుంచి 4 రోజుల పాటు దావోస్‌ పర్యటనకు సీఎంతోపాటు మంత్రి శ్రీధర్‌ బాబు వెళ్లనున్నారు. ఈ టూర్‌ తర్వాత పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు సీఎం రేవంత్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..