TRS, Congress Conflict: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణ.. పోలీసుల ఎదుటే గొడవ
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య దాడి చెలరేగింది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే..
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి లో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య దాడి చెలరేగింది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పల్లెల్లో రాజకీయాలు చిచ్చు రేపుతున్నాయి. ఓ వర్గం వారు మరో వర్గం వారిపై పరస్పరం దాడులకు తెగబడుతున్నారు. తమ అభిమాన నాయకులు, పార్టీ నేతలు, పార్టీ పరంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విచక్షణ కోల్పోయి దాడుల(Attack) కు దిగుతున్నారు. వేటకొడవల్లు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాల వారి వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. మద్దూరు లో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో (Peddamma Talli Festival) ఇరు వర్గాలు ఎదురు పడి మాటా పెరిగి దాడులకు దారి తీసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతర సమయంలో బందోబస్తుకు వచ్చిన పోలీసుల ఎదుటే గొడవ జరగడం గమనార్హం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానిక నేతలు ఘర్షణకు పాల్పడ్డ వారిని నిలువరించారు. గ్రామంలో మళ్లీ గొడవలు రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే గ్రామం గంభీరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read
Viral Video: ఒయ్యారాలు పోతూ.. మనిషిలా రెండు కాళ్లతో నడుస్తున్న కుక్క.. నెట్టింట్లో వైరల్
సీనియర్ పాత్రికేయుడు జాతీయవాది విద్యారణ్య కామ్లేకర్ కన్నుమూత.. సంతాపం తెలిపిన వెంకయ్య, కేసీఆర్