TS Eamcet Exam Date 2022: తెలంగాణ ఎంసెట్‌ 2022 జులైలో.. కారణం ఇదే!

జేఈఈ మెయిన్‌ పరీక్షల (JEE Main 2022 exam dates) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌ పరీక్షల తేదీలు మారిన విషయం తెలిసిందే. ఇంటర్ పరీక్షల తేదీలు మారడంతో టీఎస్ ఎంసెట్‌ 2022 పరీక్షలు కూడా కొంత ఆలస్యం కానున్నాయి. .

TS Eamcet Exam Date 2022: తెలంగాణ ఎంసెట్‌ 2022 జులైలో.. కారణం ఇదే!
Ts Eamcet 2022
Follow us

|

Updated on: Mar 17, 2022 | 7:23 AM

Telangana Eamcet 2022 exams: తెలంగాణ ఎంసెట్‌ 2022 పరీక్షలు జులైలో జరగనున్నాయి. తాజాగా జేఈఈ మెయిన్‌ పరీక్షల (JEE Main 2022 exam dates) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌ పరీక్షల తేదీలు మారిన విషయం తెలిసిందే. ఇంటర్ పరీక్షల తేదీలు మారడంతో టీఎస్ ఎంసెట్‌ 2022 పరీక్షలు కూడా కొంత ఆలస్యం కానున్నాయి. ఈ ఏడాది జులై మొదటి లేదా రెండో వారంలో ఎంసెట్‌ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇంటర్‌ పరీక్షలు మే 7 వ తేదీతో ముగియాల్సి ఉండగా.. తాజాగా ప్రకటించిన కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్‌ (మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీలు), సెకండియర్‌ (మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీలు) ఎగ్జామ్స్ జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డు (TSBIE) బుధవారం (మార్చి 16) వెల్లడించింది. ఆ ప్రకారంగా ఇంటర్ పరీక్షలు మే 24తో ముగుస్తాయన్నమాట. ఇంటర్‌ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు సన్నద్దమయ్యేందుకు 45 రోజుల వ్యవధి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారంగా చూస్తే.. జులై మొదటి వారంలో ఎంసెట్‌ను నిర్వహించే అవకాశం ఉంది. మరో వైపు జులై 3 వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉన్నందున ఎంసెట్‌ను మొదటి వారంలో నిర్వహిస్తే.. విద్యార్థులకు ఇబ్బంది అవుతుందేమోనని అధికారులు ఆలోచనలోపడ్డారు. ఐతే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కు సన్నద్దమయ్యే విద్యార్థులు ఎంసెట్‌ను సునాయసంగా రాస్తారని, ప్రత్యేకంగా సిద్దం కావాల్సిన అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎంసెట్‌ పరీక్షలు జులైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

Central Govt Job Vacancies: నిరుద్యోగులకు తీపికబురు! కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8,72,243 ఉద్యోగాలు.. త్వరలోనే..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు