AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఓలప్పో.! అల్పపీడనం.. ఆపై వాయుగుండం.. పిడుగులాంటి వార్త పేల్చిన వాతావరణ శాఖ

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతోందనేది వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పొడి వాతావరణం ఉండబోతోంది అని.. అలాగే ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Rain Alert: ఓలప్పో.! అల్పపీడనం.. ఆపై వాయుగుండం.. పిడుగులాంటి వార్త పేల్చిన వాతావరణ శాఖ
Weather Report
Ravi Kiran
|

Updated on: Nov 19, 2025 | 3:10 PM

Share

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఈనెల 24వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నవి. ఈ నేపధ్యంలో రాగల 3 రోజుల్లో వాతావరణ విశేషాలు ఇలా ఉండనున్నాయి. బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, పశ్చిమ జిల్లాలలో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు ఏపీలో కూడా అల్పపీడన ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంద్రలో వచ్చే 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా వచ్చే 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Follow Us
రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే..
రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే..
రానా రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా?అవి చేసి ఉంటే కెరీర్ మరోలా
రానా రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా?అవి చేసి ఉంటే కెరీర్ మరోలా
మార్చిలోనే నిప్పులు చెరుగుతున్న బాణుడు.. వసంతకాలం కనుమరుగవుతోందా?
మార్చిలోనే నిప్పులు చెరుగుతున్న బాణుడు.. వసంతకాలం కనుమరుగవుతోందా?
ఉగాది నుంచి ఈ రాశులకు ఊచకోతే.. ఏడిపించనున్న గ్రహాలు..
ఉగాది నుంచి ఈ రాశులకు ఊచకోతే.. ఏడిపించనున్న గ్రహాలు..
Team India: 2027 ప్రపంచకప్‌ స్వ్కాడ్ నుంచి ఛాంపియన్ ప్లేయర్‌ ఔట్?
Team India: 2027 ప్రపంచకప్‌ స్వ్కాడ్ నుంచి ఛాంపియన్ ప్లేయర్‌ ఔట్?
అబ్బబ్బ.. గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు మావ..
అబ్బబ్బ.. గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు మావ..
ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు
ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు
శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం
శుక్ర గోచారం ప్రభావం: ఈ రాశులకు భారీ ధన లాభం, వాహనం-ఆస్తి యోగం
ఎలక్ట్రిక్‌ కారా.. మజాకా.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 792 కి.మీ రేంజ్
ఎలక్ట్రిక్‌ కారా.. మజాకా.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 792 కి.మీ రేంజ్
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. షెడ్యూల్‌తో బయటపడ్డ నిజం..?
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. షెడ్యూల్‌తో బయటపడ్డ నిజం..?