Telangana: ఏసీ అనేది జబ్బేమో.. ఐఏఎస్‌లకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏసీ గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు ఇలా

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏసీ గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. ఇప్పటికే అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం లేదు. ఫీల్డ్ విజిట్‌లు చేయాలని పదే పదే చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇలా ఉంటే ప్రజలకు సేవ ఎలా చేస్తారు? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏసీ అనేది జబ్బేమో! అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇకపై కంఫర్డ్ జోన్లలో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
ముఖ్యంగా, రెగ్యులర్ రిక్రూటీలకు కాకుండా పనిచేసే వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారుల బదిలీల్లో భారీ మార్పులు ఉండనున్నాయి. పనితీరు తక్కువగా ఉన్నా, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న అధికారులను తప్పించే దిశగా సీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో కలెక్టర్ల సమావేశంలో ఫీల్డ్ విజిట్‌లు చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తప్ప మిగతావారు ఎవరూ విజిట్‌లు చేయకపోవడంతో సీఎం ఆగ్రహానికి గురయ్యారు. విజిట్ చేయని కలెక్టర్లపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
పోలీసు అధికారులపై కూడా సీఎం ఫోకస్ పెట్టారు. ఇసుక దందాలు, పేకాట నిర్వాహణ వంటి అవినీతి పనుల్లో భాగమవుతున్న అధికారులను తొలగించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పనిచేసే వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని సంకేతాలు అందడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు ప్రభుత్వంలో పారదర్శక పాలన తీసుకురావడానికి సీఎం చేస్తున్న ప్రయత్నాలుగా భావిస్తున్నారు. పనితీరు, ఫీల్డ్ విజిట్‌లకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణలో కొత్త పంథా సృష్టించాలనే సీఎం సంకల్పంతో ఉన్నారు. మరి ఈ మార్పులు ఎంతవరకు అమలు అవుతాయో వేచి చూడాలి!
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి