CM Revanth Reddy: పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ మార్క్.. పూర్తి భాద్యతలు ఆయనకేనా..?
కేబినెట్ కీలక మంత్రులను పక్కనే పెట్టుకుని మరీ అభ్యర్ధిని ప్రకటించడం అంటే. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు కూడా ఆయన చేతికే అనే సంకేతాలు ఇప్పుడు ప్రభుత్వం లో పార్టీలో చర్చకు కారణమైంది. అసలు రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు అవే సిగ్నల్స్ వేళ్లేలా చేస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నారా..? మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా రేవంత్ మారబోతున్నారా..? పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగారా? అధిష్టానం మొత్తం అధికారాలు అప్పగించిందా? ఎంపీ టికెట్లు ప్రకటించడం ద్వారా ఢిల్లీ నుంచి పవర్ సెంటర్ హైదరాబాద్ కు మారిందా? కేబినెట్ కీలక మంత్రులను పక్కనే పెట్టుకుని మరీ అభ్యర్ధిని ప్రకటించడం అంటే. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు కూడా ఆయన చేతికే అనే సంకేతాలు ఇప్పుడు ప్రభుత్వం లో పార్టీలో చర్చకు కారణమైంది. అసలు రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు అవే సిగ్నల్స్ వేళ్లేలా చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తన మార్క్ ను చూపిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.4వేల కోట్లతో డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక ఎత్తుఅయితే అదే సభలో మాట్లాడిన మాటల సందర్భంలో ఆయన నోటి నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయశంగా మారాయి..
లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంకా కసరత్తు పూర్తి చేయలేదు. అయితే, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. పార్టీ హైకమాండ్ అనౌన్స్ చేసే సంప్రదాయం నుండి నేరుగా వైఎస్సార్ తర్వాత అభ్యర్థిని స్వతంత్రంగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీలో తన మార్క్ ను చూపించారు. ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ రేసు గుర్రాల్లో మొదటి రేసు గుర్రాన్ని కోస్గి సభలో తానే స్వయంగా ప్రకటించారు సీఎం రేవంత్. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న వంశీచంద్ రెడ్డికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రజలు వంశీచంద్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. తన నియోజకవర్గంలో 50 వేల అధిక్యత వచ్చేలా చేయాలన్న రేవంత్.. పాలమూరు ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పేరు ను ఖారారు చేశారు. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపేసినట్లుగా చేప్పకనే చేప్పారు.
కోస్గి సభలో సోలో స్టేట్ మెంట్ –
ఇక గతంలో పని చేసిన ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఏఐసీసీ ప్రమేయం లేకుండా అభ్యర్థిని ప్రకటించిన దాఖలలు లేవు. గతంలో వైఎస్సార్ మాత్రమే తన మార్క్ ను చూపిస్తూ అభ్యర్థులను ప్రకటించారు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మాత్రం రేవంత్ కు అధిష్టానం పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అటు ఢిల్లీ పర్యటనల్లోను రేవంత్ తన మార్క్ ను చూపించి అదిష్టానం పెద్దలకు ఇక్కడ జరుగుతున్న రిపోర్ట్ ను ఇచ్చారు. దాంతో పూర్తిగా సాటిస్పై అయిన అధిష్టానం భవిష్యత్ నిర్ణయాలపై కూడ స్వేచ్చ ఇచ్చారట. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ వ్యవహరించిన వ్యూహం కూడా పార్టీకి కలిసోచ్చింది. కొన్ని చోట్ల తన ముఖ్యమైన అనుచరులు ఉన్న కూడా వారి సీట్లు త్యాగం చేయించి గెలుపు గుర్రాలకు పట్టం కట్టారు. దీంతో పార్టీ రేవంత్ కమిట్ మెంట్ అప్పటి నుండే గుర్తిస్తూ వస్తుంది.
ఇక సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం ఇస్తున్న స్వేచ్ఛకు నిదర్శనం కోస్గి సభలో కేబినెట్‌లోని ముఖ్యమైన మంత్రులు స్టేజీపై ఉండగానే రేవంత్ వంశీచంద్ రెడ్డిని సభలో ప్రకటించడంతో ఇక రేవంత్ స్ట్రాంగ్ అవుతున్నారు అనే వాదనకు బలం చేకూరుతుంది. దీంతో పాటుగా పార్లమెంట్ పై కూడా సీఎం సీరియస్‌గా పోకస్ చేసినట్లుగా ఆర్థం అవుతుంది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గానూ 14 సీట్లలో కాంగ్రెస్ నెగ్గి, కాంగ్రెస్ హై కమాండ్ కు గిప్ట్ గా ఇవ్వాలని భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తానై వ్యవహరించి పార్టీ భాద్యతలు మోసిన రేవంత్, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటజి ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట.
ఇక దీనికోసం కార్పోరేషన్ల భర్తీతో పాటుగా, కేబినెట్ విస్తరణ కూడా రేవంత్ రెడ్డికి స్వేచ్చను ఇచ్చిందట హైకమాండ్. దీంతో మిషన్ 20 ఇయర్స్ పేరుతో, కాంగ్రెస్ పార్టీని ఇరవై ఎళ్లు అధికారంలో ఉంచేలా నేక్స్ట్ జనరేషన్ లీడర్‌షిప్‌పై పోకస్ చేశారట రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే కార్పెరేషన్ పదవులు, ముఖ్యమైన నియామాకాలు అన్ని రేవంత్ కు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ..
వైఎస్సార్ అంత స్వేచ్చ వచ్చినట్లేనా..?
ఇక ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాత్రమే రాష్ట్రంలో ఈ స్వేఛ్ఛ ఉండేది కాంగ్రెస్ లో. ఇప్పడు సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ చూస్తుంటే మరో వైఎస్సార్ గా మారుతున్నారు అనే టాక్ పార్టీలో ప్రభుత్వంలో నడుస్తుంది. తన మార్క్ చూపిస్తూ, డెసిజన్ మేకింగ్ లో అటు రాష్ట్ర నేతలను, ఢిల్లీ పెద్దలను కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయిన రేవంత్ భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టారట. మొత్తానికి పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనతో ఇప్పుడు ఆశావాహులు అందరు అటు హైకమాండ్ తో పాటుగా, ఇటు రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారట. అక్కడ ఇక్కడ మార్కులు అవసరమనే భావనలోకి వచ్చారట..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
