Telangana Assembly: తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత అదే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !
తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిరాధారమని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం చాటడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి వేరు దేవత వేరు అని, ఏ తల్లికి కిరీటం ఉండదని స్పష్టిం చేశారు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమేనని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా? ఈ అంశాన్ని జనాలకు వివరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించారు
తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నిరాధారమని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టాలి అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం చాటడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చెప్పారు. ప్రజలు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని సీఎం ఎమ్మెల్యేలను కోరారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన చర్చను సీఎం అసెంబ్లీ లో ప్రారంభించారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో సభ్యులకు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి