డీఎస్ చివరి కోరిక తీరింది.. భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..

డీఎస్ భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా కప్పి అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆయన పార్థివదేహాన్ని తన సొంత ఊరు నిజామాబాద్ కు తరలిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ శనివారం తెల్లవారి 3 గంటలకు మరణించారు.

డీఎస్ చివరి కోరిక తీరింది.. భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..
D Srinivas
Follow us

|

Updated on: Jun 29, 2024 | 3:54 PM

డీఎస్ భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా కప్పి అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆయన పార్థివదేహాన్ని తన సొంత ఊరు నిజామాబాద్ కు తరలిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ శనివారం తెల్లవారి 3 గంటలకు మరణించారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. డి. శ్రీనివాస్ అంత్యక్రియల్లో సీఏం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శనివారం డీఎస్ కు నివాళి అర్పించేందుకు రాలేకపోతున్నారు. అయితే ఆదివారం నిజామాబాద్ వెళ్లి మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. అయితే ఈ క్రమంలోనే డిఎస్ పార్థివదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలని నిర్ణయించారు ఆపార్టీ పెద్దలు. పీసీసీ తరపున మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా కప్పారు.

కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ పార్ధీవదేహంపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కాంగ్రెస్ జెండా కప్పి గౌరవించారు. కాంగ్రెస్ కండువా కప్పగానే ఆయన స్నేహితులు, దగ్గరి వారు డీఎస్ చివరి కోరిక తీరిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిఎస్ పార్థివదేహాన్ని నిజామాబాద్ తలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ స్వయంగా వెళ్లి కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్‎కు నివాళులు అర్పించనున్నారు. ఆతరువాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన భౌతికకాయంపై జండా కప్పిన తరువాత పోలీసుల గౌరవవందనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో డీఎస్ పార్థివదేహాన్ని నిజామాబాద్ కు తరలిస్తున్నారు. అందులో రాష్ట్ర మంత్రులతో పాటు డీఎస్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..