CM KCR: నెరవేరనున్న దశాబ్దాల నాటి కల.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Palamuru-Ranga Reddy project : పాలమూరు ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతున్నది. బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను సైతం కృష్ణమ్మ తడుపబోతున్నది. పాలమూరు జిల్లా కృష్ణమ్మ గలగలలతో పరవళ్లు తొక్కనుంది.. ఇంతకాలం..పాలమూరు పక్క నుంచి కృష్ణమ్మ వెళ్లినా..అడుగు నేల తడవని దుస్థితి..ఇప్పుడు లక్షల ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు పాతాళంలో నుంచి పైగి ఎగసి వస్తున్నాయి..

Palamuru-Ranga Reddy project : పాలమూరు ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతున్నది. బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను సైతం కృష్ణమ్మ తడుపబోతున్నది. పాలమూరు జిల్లా కృష్ణమ్మ గలగలలతో పరవళ్లు తొక్కనుంది.. ఇంతకాలం..పాలమూరు పక్క నుంచి కృష్ణమ్మ వెళ్లినా..అడుగు నేల తడవని దుస్థితి..ఇప్పుడు లక్షల ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు పాతాళంలో నుంచి పైగి ఎగసి వస్తున్నాయి.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతికి అంకితం చేయనున్నారు. కృష్ణా జలాలకు పూజలు చేయనున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్ వద్ద సీఎం కేసీఆర్ బటన్ నొక్కి బహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. 16న నార్లపూర్ పంప్‌హౌస్ ప్రారంభం తర్వాత రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. కాగా.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు కలశాల ద్వారా కృష్ణ జలాన్ని ఎంపీడీఓల ద్వారా పంచాయతీ సెక్రెటరీలు, సర్పంచులకు అందించనున్నారు. కలశాల్లో ఇచ్చిన జలాలతో గ్రామాల్లోని దేవతల కాళ్లు కడిగి అభిషేకం చేస్తారు.. ఆ తర్వాత..సింగోటం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 680 మీటర్ల లోతు నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి బాహుబలి బాప్ లాంటి మోటార్లు ఉపయోగించారు. ఒక్కో మోటార్ వందల టన్నుల బరువుతో ప్రపంచస్థాయి టెక్నాలజీ, సామర్థ్యంతో పని చేస్తాయి. పాలమూరు- రంగారెడ్డి జిల్లాలోని కొన్ని లక్షల ఎకరాలకు. ఈ మోటార్లు నీటిని ఎత్తిపోయనున్నాయి.. కిలోమీటర్ల పొడవును నిర్మించిన టన్నెల్ ద్వారా కృష్ణా జలాలు పుప్పొడి లాంటి పాలమూరు దుక్కులను తడపడానికి కాసేపట్లో బయల్దేరనున్నాయి. దీంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం 12.3లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతోంది. వాస్తవానికి పాలమూరు పక్కనే కృష్ణ పరుగులు తీస్తున్నా.. చుక్కనీరు జిల్లాలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో జిల్లాలో ఎప్పుడూ కరువు కాటకాలే విలయతాండవం చేసేవి. అయితే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో ఇప్పుడు పాలమూరే కాదు.. రంగారెడ్డి జిల్లానీ సస్యశ్యామలం చేయబోతోంది కేసీఆర్ ప్రభుత్వం.. ఇరిగేషన్ రంగంలో కాళేశ్వరంతో పోటీపడే స్థాయితో తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని నిర్మించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు రిజర్వాయర్లను నిర్మించారు. అంజనాగిరి, ఏదుల వీరంజనేయ, వట్టేం వెంకాటాద్రి, కరివెన కురుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయిర్లను నిర్మించి మొత్తం 34 మహా బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. మొత్తం 120 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ ద్వారా వచ్చే కృష్ణా జలాలతో వివిధ రిజర్వాయర్లను నింపనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
