AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ముకర్రం ఝా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌.. నిజాం కుటుంబ సభ్యులకు పరామర్శ..

ఏడో నిజామ్‌ మనవడి భౌతికకాయం హైదరాబాద్‌కి చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చౌమహల్లా ప్యాలెస్‌లో , ముకరం ఝా భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. రేపు సాయంత్రం ముకరం ఝా అంత్యక్రియలు నిర్వహిస్తారు.

CM KCR: ముకర్రం ఝా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌.. నిజాం కుటుంబ సభ్యులకు పరామర్శ..
CM KCR Meets Nizam Family Members
Sanjay Kasula
|

Updated on: Jan 17, 2023 | 8:42 PM

Share

హైదరాబాద్‌ సంస్థానానికి ఆఖరి నిజాం మనవడు ముఖరం ఝా అంత్యక్రియలకు సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రత్యేక విమానంలో 8వ నిజాం పార్థివ దేహాం హైదరబాద్‌కి చేరుకుంది. చౌమహల్లా ప్యాలెస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.. ముకరం ఝా భౌతికకాయాన్ని సందర్శించి.. ముకరం భౌతికకాయానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్‌.. అనంతరం అక్కడే ఉన్నవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ముఖరం ఝా కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కా మసీదులో ఆయన సమాధిని ఉంచేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ముఖరం ఝా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచుతారు.

బుధవారం సాయంత్రం 4 గంటలకు మక్కా మసీదులో ముకరం జా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం