AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: ఖమ్మం BRS సభకు వచ్చే అతిథులు ఫిదా అయ్యేలా విందు.. 38 రకాల ఐటమ్స్ ఇవే

ఖమ్మం గుమ్మం నుంచి సమరశంఖం పూరించబోతోంది BRS. ఆవిర్భావ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా.. జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలన్నదే మొదటి టార్గెట్.! ఇక సభకు వచ్చే అతిథులకు పసందైన విందు ఏర్పాటు చేస్తున్నారు.

Khammam: ఖమ్మం BRS సభకు వచ్చే అతిథులు ఫిదా అయ్యేలా విందు.. 38 రకాల ఐటమ్స్ ఇవే
Food Arrangements for Khammam BRS Meeting
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2023 | 8:32 PM

Share

ఖమ్మం సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది BRS. సభకు ముగ్గురు సీఎంలు, నేషనల్ పార్టీల నేతలను ఆహ్వానించడం ద్వారా జాతీయస్థాయిలోనూ చర్చ జరిగేలా ప్లాన్ చేసింది. CMలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయ్‌, మాజీ CM అఖిలేష్‌ యాదవ్‌, CPI ప్రధాన కార్యదర్శి రాజా ఇప్పటికే వచ్చేశారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్‌లో అందరితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు KCR. దేశరాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు..! BRS ఎజెండా, విధివిధానాలపై బుధవారం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని వివరించడం…! అదే మాదిరిగా దేశానికి ఏం అవసరం.. ఎలాంటి పథకాలు తీసుకొస్తామన్నది ప్రకటించనున్నారు. ఆప్‌, సీపీఎం, సీపీఐ, SP పార్టీల నేతల్ని ఆహ్వానించడం ద్వారా.. భవిష్యత్‌లో ఈ పార్టీలతోనే దోస్తీ ఉంటుందన్న సంకేతాలనూ ఇస్తున్నారు KCR.

విమర్శల సంగతి పక్కన పెడితే..ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లే చేసింది BRS. వంద ఎకరాల్లో సభ.. 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు..5 లక్షల మంది జనసమీకరణ టార్గెట్‌గా పెట్టుకున్నారు.. మొత్తం వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. హైదరాబాద్‌ నుంచి అతిథులతో కలిసి 2 హెలికాఫ్టర్లలో మొదట యాదాద్రికి వెళ్తారు CM కేసీఆర్. దర్శనం తర్వాత నేరుగా ఖమ్మం చేరుకొని కలెక్టరేట్‌తోపాటు రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సభా వేదికపై ముఖ్య అతిథులతోపాటు.. ఖమ్మం జిల్లా BRS ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు మాత్రమే ఉంటారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో కూర్చుంటారు

సభకు విచ్చేసే ప్రముఖులకు తెలంగాణ వంటకాలతో అద్భుతమైన విందు ఇవ్వనున్నారు. ఈ సభకు వచ్చే అతిథులకు అచ్చ తెలంగాణ వంటకాల రుచి చూపించేందుకు.. మెనూ రెడీ చేశారు.  మొత్తం 38 రకాల వంటకాలను వడ్డించనున్నారట. అందులో 17 రకాల నాన్‌ వెజ్‌ ఐటెమ్స్, 21 రకాల వెజ్‌ ఐటమ్స్ ఉన్నాయి. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండి

  • మటన్‌ బిర్యానీ
  • చికెన్‌ దమ్‌ బిర్యానీ
  • ప్రాన్స్ బిర్యానీ
  • కొరమీను కూర
  • తెలంగాణ స్టైల్ మటన్‌ కూర
  • తలకాయ ఇగురు
  • నాటుకోడి కూర
  • బొమ్మిడాయల పులుసు
  • బోటీ ఫ్రై
  • మటన్‌ లివర్‌ ఫ్రై
  • పనీర్‌ బటర్‌ మసాలా
  • మెతీ చమన్‌
  • దాల్‌ తడ్కా
  • బచ్చలకూర
  • మామిడికాయ పప్పు
  • బీరకాయ శనగపప్పు
  • బెండకాయ కాజు ఫ్రై
  • ముద్దపప్పు
  •  తెలంగాణ ఫేమస్ పచ్చిపులుసు

ఇంకా రకారకాల స్వీట్లు, హాట్ ఐటమ్స్, పలు మిక్సింగ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం 500 మంది స్పెషల్ గెస్టుల కోసం ఈ మెనూ సిద్దం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం