Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Chicken Rate: ఏ మాత్రం కిందకు దిగనంటున్న చికెన్ ధర.. ప్రస్తుతం కేజీ ఎంతంటే..?

వారానికి రెండు, మూడు సార్లు చికెన్ తినే వాళ్లు కాస్తా...ధరలు పెరగడంతో కోడి కూర తినాలన్న ఆలోచనను విరమించుకుంటున్నారు. అందుకు కారణం పెరిగిన రేట్లే. నెల రోజుల వ్యవధిలో కిలోకి వంద రూపాయలు పెరిగిందంటే ఏ రేంజ్‌లో చికెన్‌ ధర దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు.

Today Chicken Rate: ఏ మాత్రం కిందకు దిగనంటున్న చికెన్ ధర.. ప్రస్తుతం కేజీ ఎంతంటే..?
Chicken / GETTY IMAGES
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 18, 2023 | 2:50 PM

చికెన్ ధర ఏ మాత్రం కిందకు దిగనంటుంది. ఆదివారం కదా.. నాన్ వెజ్ టేస్ట్ చేద్దామనుకున్న జనాలకు.. చికెన్ షాపు ముందు బోర్డులు యథావిధిగా షాకిచ్చాయి.  ప్రస్తుతం కేజీ 300లకు పైనే ఉంది. స్కిన్ లెస్ ధర రూ.340-360 మధ్య ఉంది.  అదే బోన్ లెస్ అయితే కిలోకి 400 చెల్లించాల్సిందే. లైవ్ కోడి అయితే కిలో 170-200 వరకూ పలకుతోంది. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరలు భారంగా మారాయి. ఇంకో 100 పెడితే హాఫ్ కేజీ మటన్ వస్తుందిగా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. కానీ కోడి మాంసం మాత్రమే తినేవాళ్లు.. చికెన్‌కు అంత రేటు పెట్టలేక నిట్టూరుస్తున్నారు.

ధర పెరగడంతో గణనీయంగా పెరగడంతో విక్రయాలు తగ్గాయని అంటున్నారు వ్యాపారులు. మండుతున్న ఎండలతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. అంతేకాదు రా మెటీరియల్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ఫారాల్లోని కోళ్లు వేడికి తట్టుకోలేక చనిపోతున్నాయి. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. కిలో మటన్ ధర 800 రూపాయలు పలుకుతోంది. అయితే చికెన్ కూడా మటన్‌తో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఓ వైపు మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు చికెన్ ధరలు పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రత్యేకంచి ఏపీలో చిత్తూరు జిల్లాలోనే బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. అక్కడ ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో ఎండలకు పిల్లలు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. తాజా అంచనాల ప్రకారం మరో రెండు, మూడు వారాల పాటు ఇవే ధరలు ఉండొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..