Telangana: అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. మహబూబ్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్..

తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ అలజడి మళ్లీ మొదలైంది. మహబూబ్‌నగర్‌లో శివారు ప్రాంతాలే టార్గెట్‌గా డేంజరస్ గ్యాంగ్‌ దొంగతనాలకు పాల్పడుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.

Telangana: అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. మహబూబ్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్..
Cheddi Gang

Updated on: Jan 20, 2023 | 12:01 PM

తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ అలజడి మళ్లీ మొదలైంది. మహబూబ్‌నగర్‌లో శివారు ప్రాంతాలే టార్గెట్‌గా డేంజరస్ గ్యాంగ్‌ దొంగతనాలకు పాల్పడుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ చెడ్డీ గ్యాంగ్ హడలెత్తిస్తోంది. నాలుగు రోజుల క్రితం బృందావన్‌ కాలనీలో 12 తులాల బంగారం అపహరించుకుపోయింది ఈ దొంగల ముఠా. తాజాగా అదే కాలనీలో చోరీకి విఫలయత్నం చేసింది.

చెడ్డీగ్యాంగ్‌ రాత్రి చోరీకి యత్నిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఒంటిపై చెడ్డీ, ముఖానికి మాస్క్‌, చేతిలో ఆయుధం పట్టుకుని తిరుగుతోన్న ముఠా దృశ్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు చిక్కడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. సీపీ ఫుటేజ్ ల ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌.. మకాం మార్చినట్లు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ముఠా కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, గత ఏడాది నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల చెడ్డీ గ్యాంగ్‌ సంచరించడం కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..