Telangana: “పర్ డ్రాప్ మోర్ క్రాప్” పథకాన్ని ఆశించినదాని కంటే మెరుగ్గా అమలు.. తెలంగాణ సర్కారుకు కేంద్రం కితాబు..
PM Krishi Yojana: "పర్ డ్రాప్ మోర్ క్రాప్" పథకాన్ని ఆశించినదాని కంటే మెరుగ్గా అమలు చేసిందని.. వ్యవసాయంలో ఐటీ వినియోగాన్ని సైతం కేంద్రం మెచ్చుకుంది. ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు.. తెలంగాణ వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Per Drop More Crop: తెలంగాణ సర్కారుకు కేంద్రం కితాబు నిచ్చింది. వ్యవసాయంలో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించింది. “పర్ డ్రాప్ మోర్ క్రాప్” పథకాన్ని ఆశించినదాని కంటే మెరుగ్గా అమలు చేసిందని.. వ్యవసాయంలో ఐటీ వినియోగాన్ని సైతం కేంద్రం మెచ్చుకుంది. ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు.. తెలంగాణ వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావుతో కేంద్ర వ్యసాయ శాఖ జాయింట్ సెక్రటరీ డా. యోగితా రాణా నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ ప్రకటన జారీ చేసింది కేంద్రం. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ యోగితారాణా తెలంగాణ అనుసరిస్తున్న పద్దతులను ప్రశంసించారు.
అనంతరం యోగితారాణ మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని.. 2014-15లో 129.04 లక్షల ఎకరాలు ఉన్న సాగు 2022-23 నాటికి 232.58 లక్షల ఎకరాలకు పెరిగిందని తాజాగా కేంద్ర జారీ చేసిన రిపోర్టులో పేర్కొంది. వరి సాగు విస్తీర్ణం 2014లో 22.74 లక్షల ఎకరాలు నుంచి 2022లో 64.99 లక్షలకు ఎకరాలకు పెరిగిందని వెల్లడించింది. ఈ ఏడాది జూలై 12 నాటికి తెలంగాణలో 42.76 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని అన్నారు.
తెలంగాణలో విత్తరాలు, ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని.. 950కి పైగా ఆగ్రో రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ఎరువులు సహా వ్యవసాయ ఇన్‌పుట్ సేవలు అందిస్తున్నామన్నారు. రైతు వేదికల ద్వారా నానో యూరియా సహా వివిధ రసాయన రహిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోందన్నారు. నానో యూరియా వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టిందంటూ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం