Burgula Narsing Rao: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత.. సీఎం కేసీఆర్‌ సంతాపం

Burgula Narsing Rao: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు (89) కన్నుమూశారు. నర్సింగరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు సాగిన ఉద్యమంలో ....

Burgula Narsing Rao: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత.. సీఎం కేసీఆర్‌ సంతాపం
Follow us

|

Updated on: Jan 18, 2021 | 4:52 PM

Burgula Narsing Rao: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు (89) కన్నుమూశారు. నర్సింగరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు సాగిన ఉద్యమంలో తనవంతు పాత్ర వహించారు. అహర్నిశలు కమ్యూనిస్టు ఉద్యమ పురోగతికి కృషి చేశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, నేతలు సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన యోధుడు అని నర్సింగరావు పలువురు కొనియాడారు. తెలంగాణ ఉద్యమం తొలిదశ నుంచి మలిదశ వరకు బూర్గుల పోరాడారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

అలాగే నర్సింగరావు మృతి పట్ల సీపీఐ నేత నారాయణ కూడా సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సైనికుడిగా నిలబడ్డారని, కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధిలో పెద్ద దిక్కుగా ఉండేవారని అన్నారు. ఆయన మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటన్నారు.

Also Read:

Mancherial Road accident: మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. దంపతులు మృతి