MLC Kavitha: మీ సేవలో డేటా ఉంది.. కాలయాపన కోసమే దరఖాస్తుల స్వీకరణ.. కవిత కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికి జనవరి నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రజల నుంచి దరఖాస్తుల రూపంలో అన్ని వివరాలు అడుగుతున్నారు.. కానీ బ్యాంక్ వివరాలు అడగడం లేదని అన్నారు. మీ సేవాలో ప్రజల పూర్తి డేటా ఉందని.. కాలయాపన కోసమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని విమర్శించారు.

ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికి జనవరి నుంచి పెంచిన పెన్షన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రజల నుంచి దరఖాస్తుల రూపంలో అన్ని వివరాలు అడుగుతున్నారు.. కానీ బ్యాంక్ వివరాలు అడగడం లేదని అన్నారు. మీ సేవాలో ప్రజల పూర్తి డేటా ఉందని.. కాలయాపన కోసమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని విమర్శించారు. బ్యాంక్ డిటైల్స్ పేరుతో మరికొద్ది రోజులు కాలయాపన చేస్తారని అనుమానం కలుగుతోందని కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ పూర్తయిన తరువాత మాట్లాడితే బాగుంటుందని అన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీ నిర్ణయమే అని చెప్పారు.
దక్షిణాది కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర మన తెలంగాణలో ఉండడం గర్వకారణమన్నారు. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మేడారం జాతరకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మంత్రులు విమర్శలు చేయడం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కవిత పేర్కొన్నారు. కార్లు కొనడం ప్రభుత్వ భద్రతకు సంబధించిన విషయమని.. ప్రజాప్రతినిధుల కాన్వాయ్ ఎక్కడ ఉంచాలి.. ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇంటలిజెన్స్, సెక్యూరిటీ సీక్రెట్స్ కు సంబధించిన విషయమన్నారు. 22 కార్లు విజయవాడలో దాచరని సీఎం మాట్లాడం ఆయన స్థాయికి తగదన్నారు.
పెన్షన్ వస్తున్న వారికి జనవరి 1 నుండి పెన్షన్ పెంచి యధావిధిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని.. FIR లేకుండా ఉద్యమాలు చేసిన వారి పరిస్థితి ఎంటి..? అని ప్రశ్నించారు. 200 యూనిట్స్ తక్కువ ఉన్న వారు ఎవరూ బిల్లు కట్టకపోతే మంచిదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..