Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు..

ఇదిలా ఉంటే ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పరీక్ష ఫీజు చెల్లిందచేందుకు గడువు పొడగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి డిసెంబర్‌ 30వ తేదీతో గడువు ముగిసిన నేపథ్యంలో జనవరి 3వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది...

Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పెంపు..
Telangana Inter Exams
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2023 | 11:52 AM

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్‌ అధికారులు విడుదల చేశారు. ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పరీక్ష ఫీజు చెల్లిందచేందుకు గడువు పొడగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి డిసెంబర్‌ 30వ తేదీతో గడువు ముగిసిన నేపథ్యంలో జనవరి 3వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. జనవరి 3వ తేదీలోగా విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 10,59,233 మంది విద్యార్థులు అడ్మిషన్స్‌ పొందారు. వీరిలో 8,99,041 మంది విద్యార్థులు ఎలాంటి ఫైన్‌ లేకుండా ఫీజు చెల్లించారు. ఇక మరో 61,005 మంది విద్యార్థులు రూ.100 ఫైన్‌తో, 8,638 మంది విద్యార్థులు రూ.500ల ఫైన్‌తో, 5,212 మంది విద్యార్థులు రూ.1000 ఫైన్‌తో, 3,144 మంది విద్యార్థులు రూ.2వేలఫైన్‌తో చెల్లించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 9,77,040 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.

పరీక్ష షెడ్యూల్ విషయానికొస్తే.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్ పరీక్షలు 28-02-2024న మొదలై.. 18-03-2024న జరిగే మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-Iతో ముగుస్తాయి. ఇక ఇంటర్‌ సెకండ్‌ ఇయర్ విషయానికొస్తే.. 29-02-2024 సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-IIతో ప్రారంభమై, 19-03-2024న జరిగే మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II పరీక్షతో ముగుస్తాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..