BRS Patry: ఈసారి కూడా టికెట్ నాకే.. మళ్లీ నేనే గెలుస్తానంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఈసారి టికెట్ ఖాయమని.. మళ్లీ గెలుపు కూడా తనదేనంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టిక్కెట్‌ను మాజీ మంత్రి కడియం శ్రీహరికి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఈసారి టికెట్ ఖాయమని.. మళ్లీ గెలుపు కూడా తనదేనంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టిక్కెట్‌ను మాజీ మంత్రి కడియం శ్రీహరికి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లను రాజయ్య కొట్టిపారేశారు. ఆ వార్తలకు ఎవరూ కంగారుపడొద్దని సూచించారు. ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కడియం శ్రీహరితో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రాజయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్‌కు వీర విధేయుడుగా ఉన్నానని రాజయ్య పేర్కొన్నారు. పని చేసుకుంటూ పోతే పార్టీ అధ్యక్షుని వద్ద గుర్తింపు ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణుల్ని కోరారు. అలాగే ఆరోజున సాయంత్రం జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.