AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఉత్కంఠకు తెర.. ఆ ముగ్గురి పేర్లను ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్..

రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్..

BRS: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఉత్కంఠకు తెర.. ఆ ముగ్గురి పేర్లను ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్..
BRS Chief KCR
Sanjay Kasula
|

Updated on: Mar 07, 2023 | 5:10 PM

Share

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం గులాబీ పార్టీలో కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

షెడ్యూల్ ప్రకారం, మార్చి 6న తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్, మార్చి 13 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మార్చి 14న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 16 వరకు గడువు ఇచ్చారు. ఆయా స్థానాలకు ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. పోలైన ఓట్లను అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి లెక్కించి, విజేతను ప్రకటిస్తారు. మార్చి 25 లోగా ఎన్నికలను పూర్తి చేస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం