AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: కాపాడండి మహా ప్రభో..! ఎలుకలు కొరుకుతున్నాయి.. వర్సిటీ హాస్టల్ విద్యార్థుల మొర..

వరంగల్ కాకతీయ వర్సిటీలో ఎలుకలు టెన్షన్‌ పెడుతున్నాయి. గర్ల్స్ హాస్టళ్లలో నిద్రపోతున్న విద్యార్థుల కాళ్లు చేతులు కొరకుతున్నాయి. ఎలుకల దాడిలో కొందరికి గాయాలయ్యాయి.

Warangal: కాపాడండి మహా ప్రభో..! ఎలుకలు కొరుకుతున్నాయి.. వర్సిటీ హాస్టల్ విద్యార్థుల మొర..
Kakatiya University
Sanjay Kasula
|

Updated on: Mar 07, 2023 | 4:25 PM

Share

వరంగల్ ఎంజీఎం లో ఎలుకల ఘటన గురించి మరిచిపోకముందే కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టళ్లలో నిద్రపోతున్న విద్యార్థుల కాళ్లు చేతులు కొరకుతున్నాయి. ఎలుకల దాడిలో కొందరికి గాయాలయ్యాయి. ఎలుకలు కొరకడంతో గాయాలపాలైన విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .క్యాంపస్ లోని పద్మాక్షి హాస్టల్ ‘డీ’ బ్లాక్‌ రూం నంబరు-1లో ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం బాధిత విద్యార్థినులు హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఘటన జరిగిన గదిలో పారిశుధ్యం లోపించిందని. పనికిరాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని దీంతో ఎలుకలు, స్వైర విహారం చేస్తున్నాయంటున్నారు. ఎలుకలతో తాము  ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్‌ కేర్‌టేకర్లు, ఇతర సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, హన్మకొండ కాకతీయ వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థినిలు గత కొన్ని రోజులుగా హాస్టల్ వసతి కల్పించాలని వీసీ రమేష్ ను కలిసి సమస్యను వివరించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు కోవాలని ఎన్నో కష్టాలను అధిగమించి వర్సిటీలో సీటు సంపాదించామని.. తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వచ్చిన కూలి పైసలతో వేల రూపాయల ఫీజులు కట్టినా.. హాస్టల్ వసతి కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?