Warangal: ‘మా ఊరికి ఎందుకొచ్చావ్’.. ఆ సీనియర్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ కేడర్..

ఆ ఎమ్మెల్యేకు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తన స్వంత నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. స్వంత పార్టీ కార్యకర్తలు, తన స్వంత సామాజిక వర్గానికి చెందిన ప్రజలే నిలదీస్తున్నారు. తమ ఊళ్ళో అడుగుపెట్టొద్దంటూ ఎదురు తిరుగుతున్నారు.

Warangal: ‘మా ఊరికి ఎందుకొచ్చావ్’.. ఆ సీనియర్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ కేడర్..
Brs Mla Redya Naik
Follow us
G Peddeesh Kumar

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 13, 2023 | 4:29 PM

ఆ ఎమ్మెల్యేకు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తన స్వంత నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. స్వంత పార్టీ కార్యకర్తలు, తన స్వంత సామాజిక వర్గానికి చెందిన ప్రజలే నిలదీస్తున్నారు. తమ ఊళ్ళో అడుగుపెట్టొద్దంటూ ఎదురు తిరుగుతున్నారు. పోలీస్ బలగాన్ని వెంటబెట్టుకొని వెళ్లినా ఊహించని ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఇంత వ్యతిరేకతకు కారణం ఏంటి? అసలేం జరిగింది? ఆ సీనియర్ ఎమ్మెల్యేపై ఎందుకంత తిరుగుబాటు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? తిరుగుబాటుకు కారణం ఏంటో ఈ స్పెషల్ పొలిటికల్ స్టోరీలో తెలుసుకుందాం..

రెడ్యానాయక్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని సీనియర్ నేత. ఆరు పర్యాయాలు డోర్నకల్ నియోజకవర్గం నుండి గెలుపొంది తన పెరిట ఓ చరిత్ర నమోదు చేసుకున్న గిరిజన నేత. అయితే, డబుల్ హ్యాట్రిక్ రికార్డే ఇప్పుడు మోసమైంది. ‘ఆరు పర్యాయాలు అంటే 30 ఏళ్ళ నుండి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నాం. నీ ఆస్తుల పెరిగాయి, చెరగని రికార్డులు నమోదయ్యాయి తప్ప మాకు ఒరగబెట్టిందేంటి? మా గ్రామాలు, తండాలకు కనీసం రోడ్లు లేవు, తండాల తలరాతలు మారలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు. ప్రశ్నిస్తే వారిపై నీ వర్గీయులతో ప్రతాపం చూస్తున్నారు. ఇప్పుడు మా ఊరికి ఏ మొఖం పెట్టుకొని వచ్చావ్. మా ఊరికి ఏం చేశావ్. చెప్పిన తర్వాతే ఊళ్ళో అడుగుపెట్టాలి.’ ఇప్పుడిదే నినాదంతో రెడ్యానాయక్ ను ఎక్కడికి వెళ్ళినా జనం వెంటాడుతున్నారు. ఊరి పొలిమేరల్లోనే నిలదీస్తున్నారు.

గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేస్తూ నిరసన గళమెత్తుతున్నారు. ఇక్కడ అక్కడని కాదు. డోర్నకల్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పోలీస్ సైన్యాన్ని వెంటబెట్టుకొని వెళ్లినా ఊళ్ళల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కురవి మండలంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం నేరడ గ్రామానికి వెళ్లిన రెడ్యానాయక్ కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలు, తన సామాజిక వర్గానికి చెందిన వారే ఎదురుతిరిగారు. ఎమ్మెల్యే గో బ్యాక్ ఆంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి పోలీస్ భద్రత మధ్య వెనుతిరిగి వెళ్లిపోయారు.

గురువారం ఉదయం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కురవి మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను సొంత పార్టీనాయకులు, కార్యకర్తలే నిలదీశారు. గ్రామ సర్పంచ్‌తో సహా, బీఆర్ఎస్ కార్యకర్తలు, గిరిజనులు నడిరోడ్డుపై తన వాహనాన్ని ఆపి కడిగిపారేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సొంత పార్టీ కార్యకర్తలే ఇలా ఎదురుతిరగడంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. విధిలేని పరిస్థితుల్లో భారీ పోలీస్ భద్రత మధ్య తన కార్యక్రమం ముగించుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు.

సీనియర్ నేత.. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన రెడ్యానాయక్ పై ఇప్పుడు ఇలాంటి ఊహించని తిరుగుబాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ కార్యకర్తలు, అనుచరులే ఆయన పై తిరుగుబాటు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..