Telangana: మనల్ని ఎవడ్రా ఆపేది..! గ్రూప్ 4 ఉద్యోగానికి ఎంపికైన అంధురాలు.. ఎందరికో ఆదర్శం

తమ బిడ్డను ఎవరు తక్కువ చేసి చూడొద్దనే తల్లిదండ్రుల తపన నెగ్గింది..కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఆమె అంధత్వాన్ని ఓడించేలా చేసింది. అడ్డంకులు అధిగమిస్తూ ఆత్మస్థైర్యం తో అనుకున్న లక్ష్యాన్ని చేరింది. రాత్రి పగలు కష్టపడి చదివి గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి ఎంపికైంది. లోకాన్ని చూడలేకపోయినా లక్ష్యాన్ని చేరిన అంధురాలు మధ్య బోయిన మానస ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Telangana: మనల్ని ఎవడ్రా ఆపేది..! గ్రూప్ 4 ఉద్యోగానికి ఎంపికైన అంధురాలు.. ఎందరికో ఆదర్శం
Blind Women Manasa
Follow us
N Narayana Rao

| Edited By: Ravi Kiran

Updated on: Nov 19, 2024 | 9:07 AM

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమల వారి గూడెం కి చెందిన అంద విద్యార్థిని మధ్య బోయిన మానస తాజాగా విడుదలైన గ్రూప్ 4 ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ గా ఎంపికైంది. ఖమ్మంలో ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగం చేస్తూనే ఆమె గ్రూప్స్‌ ఎగ్జామ్స్‌ కోసం ప్రిపేర్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేసిన మానస సహాయకురాలి సహాయంతో పరీక్ష రాసింది. ఈ పరీక్షలో అత్యుతమ ప్రతిభ కనబరిచి అంధుల కోటాలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక కావడం విశేషం.

చిన్నతనం నుంచే చదువుపై మక్కువ. చీమల వారి గూడెం లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది ఈ కొలువుల తల్లి మానస. మధ్య బోయిన వెంకట నరసయ్య కళావతి దంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు మల్లేష్, కుమార్తె మానస ఇద్దరూ అంధత్వంతో జన్మించారు ..అయినా పిల్లలను భారంగా భావించకుండా కూలి పనులకు వెళుతూ చదివించారు. వీరిలో మల్లేష్ ఎంఏ బీఈడీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక మానస ఐదవ తరగతి వరకు స్వగ్రామమైన చీమల వారి గూడెంలో చదివింది. తర్వాత ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు కారేపల్లి హైస్కూల్లో, ఇంటర్ సిఇసి కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది.

అయితే తమ గ్రామం నుండి ఎలాంటి రోడ్డు, రవాణా సౌకర్యాలు లేనప్పటికీ..ఎనిమిది కిలోమీటర్లు స్నేహితుల సహాయంతో కాలినడకన వెళ్లి చదువుకుంది..కారేపల్లి వికాస్ డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంటి వద్దే సొంతగా చదివి సిద్ధమై 2022లో ప్రైవేట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎంపికై ఉద్యోగం సాధించిన మానస..తను అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని..అనేక కష్టాలు ,ఇబ్బందులు ఎదుర్కొని చివరకు గ్రూప్ 4 ఉద్యోగం సాధించింది. మానస ను పలువురు అభినందిస్తున్నారు..

ఇవి కూడా చదవండి