Hyderabad: ఫుడ్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్‌.. బయట తింటే మీ బతుకు షెడ్డుకే..

మళ్లీ మళ్లీ చెప్తున్నాం బయట తింటే మీ బతుకు షెడ్డుకే. బయట హోటళ్లు, రెస్టారెంట్స్, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో నాణ్యత, శుభ్రత అస్సలు పాటించడం లేదు. ఆ ఫలితంగానే ఫుడ్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది.

Hyderabad: ఫుడ్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్‌.. బయట తింటే మీ బతుకు షెడ్డుకే..
Road Side Food
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 18, 2024 | 9:50 AM

నిజంగానే.. రెస్టారెంట్లో తింటే రెస్ట్‌ ఇన్‌ పీసేనా? షవర్మా ఆరగిస్తే.. పెద్దకర్మే నా? కల్తీ అల్లంపేస్ట్‌.. కల్తీ పాలు.. కల్తీ నీళ్లు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా సాగిపోతోంది భాగ్యనగరంలో ఫుడ్‌ దందా. ఇంత దారుణమా? ఇంత ఘోరమా? ఇంత కండ కావరమా? అన్ని రెస్టారెంట్లు కాదు.. కొన్ని రెస్టారెంట్లను అయితే.. హాబిచ్యువల్‌ అఫెండర్‌ లిస్టులో పెట్టాల్సిందే. పదే పదే ఫుడ్‌ కల్తీకి పాల్పడడం.. ప్రభుత్వ చర్యలు ఎదుర్కోవడం.. తిరిగి అదే పంథాని అనుసరించడం జరుగుతోంది.

షవర్మా స్టేషన్లు ఫుడ్‌ పాయిజన్‌ను పంచడంలో ముందుంటున్నాయి. ఉడికీ ఉడకని చికెన్‌.. దానిపై రాటెన్‌ మయొనైజ్‌ వేసి.. కుళ్లిపోయిన కూరగాయ ముక్కలు గుప్పించి.. రెండు మూడు రోజుల క్రితం నాటి రోటీలో చుట్టి.. అప్పుడే చేశామన్న బిల్డప్పుతో ఇచ్చేస్తున్నారు. ఫైనల్‌ రిజల్ట్‌ డయేరియా. తిన్నంతసేపు ఆనందం.. ఆతర్వాత వికారం. షవర్మాలది ఓ లెక్క అయితే.. మోమో స్టేషన్లది మరో లెక్క. ఇక్కడ మోమోస్‌లో ఉండే చికెన్‌ ఏరోజుదో ఎవరికైనా తెలుసా? ఇంతకీ వండి వారుస్తున్న ఆ మోమో బండి వాడికైనా తెలుసా? ఓ ప్రాణాన్ని సైతం బలితీసుకుంది మోమో ఫుడ్‌.

హైదరాబాద్‌కి ఓ బ్రాండ్‌ ఉంది. ఇండో అరబిక్‌ ఫుడ్‌కి.. మొఘలాయ్‌ డిషెస్‌కి.. వరల్డ్‌ ఫేమస్‌ మన నగరం. హలీంకి అయితే జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ లభించింది. కాని.. ఇప్పుడు ఈ వంటకాలను ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వండేస్తున్నారు. ఎవరికి ఇష్టమొచ్చిన మెటీరియల్‌ వారు వాడేస్తున్నారు. రుచి గురించి దేవుడెరుగు.. కనీసం ఫ్రెష్‌ సరుకుతో వండుతున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ మధ్య ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు.. ఓ ఫేమస్‌ రెస్టారెంట్‌కు వెళితే ఫ్రీజర్లలో కుళ్లిన మాంసం కనిపించింది. అసలేం జరగుతోంది. నిత్యం రద్దీగా ఉండే రెస్టారెంట్లలోనే ఇలాంటి పరిస్థితా?

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో సర్వేలో షాకింగ్‌ ఫ్యాక్ట్స్‌ బయటికొచ్చాయి. ఫుడ్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో మన హైదరాబాద్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఫుడ్‌ విషయంలో భాగ్యనగరం ప్రతిష్ట మసకబారుతూ వస్తోంది. కల్తీ ఆహారానికి సంబంధించి భారత్‌లోని ప్రముఖ 19 నగరాల్లో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సర్వే చేపట్టింది. ఆహార నాణ్యత ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే చేపట్టగా.. హైదరాబాద్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. కల్తీ ఆహారంలో టాప్‌ ప్లేస్‌లో నిలువగా.. నగరంలోని హోటల్స్‌, రెస్టారెంట్స్‌ సైతం కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విషయం సర్వేలో వెల్లడికావడం ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 62శాతం హోటల్స్‌లో ఎక్స్‌పైర్‌ అయిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ బిర్యానీ, హలీంతో పాటు మొఘలాయి వంటకాలకు హైదరాబాద్‌ అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించింది. అయితే, ఇటీవల కాలంలో అధికారుల నిర్వహించిన దాడుల్లో దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన రెండునెలల్లో నగరంలో 84శాతం ఫుడ్ పాయిజనింగ్‌ కేసులు రికార్డయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే తో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. హోటల్స్‌, రెస్టారెంట్లలో మార్పులు వచ్చే వరకు దాడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

2022 ఏడాదిలో దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు అయితే.. అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే రికార్డయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 272, 273, 274, 275, 276 కింద ఈ కేసులు నమోదు చేశారు. మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు కావడం షాకింగ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?