AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: సైబర్‌ పోలీస్‌కు వీడియో కాల్‌ చేసి బెదిరించిన ఫేక్‌ పోలీస్‌..తర్వాత ఏం జరిగిందో చూడాల్సిందే..!

ఒక నకిలీ పోలీస్‌ ఏకంగా రియల్‌ పోలీస్‌కు వీడియో కాల్‌ చేశాడు. ఆయన పోలీస్‌ అధికారి అని తెలుసుకుని అతడు షాక్‌ అయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Watch: సైబర్‌ పోలీస్‌కు వీడియో కాల్‌ చేసి బెదిరించిన ఫేక్‌ పోలీస్‌..తర్వాత ఏం జరిగిందో చూడాల్సిందే..!
Fake Cop Video Calls Real Cyber Police
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2024 | 10:29 AM

Share

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందిదో.. సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రతినిత్యం ఏదో ఒక చోట సైబర్ మోసం ఘటనలు వెలుగులోకి రావటం సర్వసాధారణంగా మారిపోయింది. ఆన్‌లైన్ మోసాలకు ప్రతిరోజూ వందలాది మంది అమాయక ప్రజలు బాధితులు అవుతున్నారు. కేటుగాళ్లు నయా ట్రిక్కులను అవలంబిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక నకిలీ పోలీస్‌ ఏకంగా రియల్‌ పోలీస్‌కు వీడియో కాల్‌ చేశాడు. ఆయన పోలీస్‌ అధికారి అని తెలుసుకుని అతడు షాక్‌ అయ్యాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ పోలీస్‌ అధికారికి నకిలీ పోలీస్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. పోలీస్ యూనిఫాం ధరించిన దుండగుడు ముంబైకి చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. హలో మీరు ఎక్కడ ఉన్నారు.. అంటూ ప్రశ్నించాడు..అయితే, అప్పటికే అది ఫేక్‌ కాల్‌ అని, సదరు వ్యక్తి ఫేక్‌ పోలీస్‌ అని గుర్తించారు కేరళ సైబర్‌ సెక్యూరిటీ. దీంతో నవ్వుతూ అతడికి సమాధానం ఇచ్చారు త్రిసూర్ పోలీస్‌ అధికారి.. తన సెల్‌ఫోన్‌ కెమెరా సరిగా పనిచేయటం లేదంటూ కాస్త తడబడినట్టుగా యాక్ట్‌ చేశారు.. ఇంతలో దుండగుడు వారిని బెదిరించే ప్రయత్నం చేశాడు..ఆ వెంటనే సైబర్ సెక్యూరిటీ పోలీస్‌ అధికారి తన మొబైల్‌ కెమెరాను ఆన్ చేయగా దుండగుడు కంగుతిన్నాడు. ఒక్కసారిగా అతడి ఫ్యూజుల్‌ ఔట్‌ అయినంత పనైంది. ఫేక్‌ పోలీస్‌ కాల్‌ చేసింది.. అసలైన పోలీసులకేనని తెలిసి బిక్కముఖం వేసుకున్నాడు..

వీడియో ఇక్కడ చూడండి..

ఇక అప్పటికే సదరు నకిలీ పోలీస్‌ వివరాలను పూర్తి రాబట్టేశారు అసలైన పోలీసులు. ఇది సైబర్‌ సెక్యూరిటీ సెల్‌ అని, నీ పూర్తి అడ్రస్‌తో సహా నీ వివరాల్లన్నీ మాకు తెలిసిపోయాయని చెప్పటంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇదంతా ఫన్నీగా ఎడిట్‌ చేసిన త్రిసూర్ సిటీ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నకిలీ పోలీస్‌కు షాక్‌ ఇచ్చిన కేరళ పోలీస్‌ అధికారిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సైబర్‌ నేరగాళ్ల భరతం పట్టాలని చాలా మందికోరుకుంటూ కామెంట్ల రూపంలో సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..