AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande bharat Train: వందే భారత్ రైలు భోజనంలో కీటకాలు.. స్పందించిన రైల్వే శాఖ.. రూ.50 వేలు జరిమానా!

IRCTC నిర్వాహణ లోపం, పరిశుభ్రత, ప్రయాణికుల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీమియం రైళ్లలో ఆహార భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఈ పోస్ట్‌లో ఎంపీ రైల్వే మంత్రిని ట్యాగ్ చేశారు.

Vande bharat Train: వందే భారత్ రైలు భోజనంలో కీటకాలు.. స్పందించిన రైల్వే శాఖ.. రూ.50 వేలు జరిమానా!
Vande Bharat Train
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2024 | 12:42 PM

Share

వందే భారత్ ప్రీమియం రైలు.. ఇది అత్యంత ఆధునికమైన, కొత్త సౌకర్యాలను కలిగి ఉంది. అయితే ఆహార నాణ్యతకు సంబంధించి అనేకసార్లు ప్రయాణికుల్ని ఆందోళనకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. తిరునెల్వేలి-చెన్నై వందే భారత్‌ రైలులో సప్లై చేసిన ఆహారంలో సజీవ కీటకాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పెద్ద సభను తాకింది. దీనికి సంబంధించి వీడియోను కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగుర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు. కాగా, ఇప్పుడు రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరునెల్వేలి-చెన్నై వందేభారత్‌ రైల్లో వడ్డించే ఆహారంలో సజీవ కీటకాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వీడియోను షేర్ చేశారు. IRCTC నిర్వాహణ లోపం, పరిశుభ్రత, ప్రయాణికుల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీమియం రైళ్లలో ఆహార భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఈ పోస్ట్‌లో ఎంపీ రైల్వే మంత్రిని ట్యాగ్ చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఎంపీ చేసిన పోస్ట్‌కు దక్షణి మధ్య రైల్వే వేగంగా స్పందించింది. తిరునెల్వేలి-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సప్లై చేసిన ఫుడ్‌ శాంపిల్స్‌ను సేకరించి పరీక్ష కోసం పంపినట్లు దక్షిణ రైల్వే వెల్లడించింది. ఫుడ్ ప్యాకెట్ మూతపై పురుగులు అంటుకున్నట్టు విచారణలో తేలిందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంలో సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 50,000 జరిమానా కూడా విధించినట్టుగా పేర్కొన్నారు. ఫుడ్‌ సప్లయర్‌పై చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించింది. ఆహార నాణ్యతకు సంబంధించి రైల్వే శాఖ కట్టుబడి ఉందని, ప్రయాణికుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..