AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఈ నెల 19 తెలంగాణకు ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. ఏర్పాట్లను సమీక్షించిన బండి సంజయ్..

PM Modi Telangana Tour: ఈనెల 19న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు కమలనాథులు. సికింద్రబాద్‌లోని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను..

PM Modi: ఈ నెల 19 తెలంగాణకు ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. ఏర్పాట్లను సమీక్షించిన బండి సంజయ్..
PM Modi
Sanjay Kasula
|

Updated on: Jan 09, 2023 | 4:21 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 19న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు కమలనాథులు. సికింద్రబాద్‌లోని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పరిశీలించారు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇందులో భాగంగా.. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు.

ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకి శంకుస్థాపన చేస్తారు. కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు కూడా శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ. అయితే వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకూ తిరగనుంది. ఈనెల 19న మొత్తం రూ.2400 కోట్ల వ్యయంతో రైల్వేకు సంబంధించి వివిధ అభివృద్ది  పనులను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలను బండి సంజయ్, లక్ష్మణ్ లకు వివరించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బండి సంజయ్, లక్ష్మణ్ రైల్వే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం బండి సంజయ్‌తో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని పర్యటన కార్యక్రమాలకు వివరించారు. తెలంగాణ ప్రయోజనాలకు ప్రధాని మోదీ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారులను నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందన్నారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానానికి చేరుకుందన్నారు.

అట్లాగే రైల్వే లేన్, డబ్లింగ్, ఎంఎంటీఎస్, గేజ్ మార్పిడీ పనులను కేంద్రం పెద్ద ఎత్తున చేపట్టిందని.. అందులో భాగంగా ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్-విశాఖపట్నం వరకు ‘వందేభారత్’ రైలును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనిద్వారా ప్రయాణీకులకు మూడున్నర గంటల సమయం ఆదా కానుందని వివరించారు. ఈ నేపథ్యంలో రూ.2400 కోట్లతో వివిధ రైల్వే అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారని లక్ష్మణ్ తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునికించడంలో సుమారు రూ.700 కోట్లతో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అట్లాగే ఖాజీపేట ఓరాలింగ్ వర్క్ షాప్ పనులను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు.

అట్లాగే రూ.1231 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికీ ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ గ్రామాల నుండి పట్టణాలకు అనుసంధానిస్తున్నారు. దీంతోపాటు నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ.. ‘‘నూతన సంవత్సర కానుకగా ప్రధాని మోదీ తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ.2400 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయబోతున్నారు. తెలంగాణకు ప్రయోజనాలకు ప్రధాని పెద్ద పీట వేస్తున్నప్పటికీ.. అబద్దాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఈ పర్యటనతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా’’అని వివరించారు.

అనంతరం బండి సంజయ్, లక్ష్మణ్ నేరుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈనెల 19న ప్రధాని రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం