Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేసేది వీళ్లే..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అందరి కంటే ముందుగా ప్రచార శంఖాన్ని పూరించగా.. కాంగ్రెస్ ఈమధ్య కాలంలో ప్రచారంలో పుంజుకుంది. ఇక వీరిద్దరికీ ధీటుగా నిలబడేందుకు సిద్దమైంది బీజేపీ. మన్నటి వరకూ కేంద్ర మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇకపై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టే వారి జాబితాను విడుదల చేసింది బీజేపీ.

Telangana BJP: తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేసేది వీళ్లే..
BJP releases list of Leaders who will campaign for Telangana Elections including PM Modi, Amit Shah in it
Follow us
Srikar T

|

Updated on: Nov 06, 2023 | 1:06 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అందరి కంటే ముందుగా ప్రచార శంఖాన్ని పూరించగా.. కాంగ్రెస్ ఈమధ్య కాలంలో ప్రచారంలో పుంజుకుంది. ఇక వీరిద్దరికీ ధీటుగా నిలబడేందుకు సిద్దమైంది బీజేపీ. మన్నటి వరకూ కేంద్ర మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇకపై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టే వారి జాబితాను విడుదల చేసింది బీజేపీ. అందులో ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారు.

ఆ తరువాత జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీలు ఉన్నారు. జాతీయ అధ్యక్షులతో పాటూ కేంద్ర మంత్రులు కూడా క్యాంపేయింగ్ చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోపాటూ కేంద్ర మహిళా మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటూ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, బండి సంజయ్‌, ఈటెల రాజేందర్ లు పాల్గొననున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కొన్ని బహిరంగ సభలకు హాజరై బీజేపీ నాయకత్వాన్ని తెలంగాణలో బలపరిచేందుకు కృషి చేయనున్నారు. దీంతో ఎన్నికల సందడి ఒక్కసారిగా వేడెక్కింది.

ఇవి కూడా చదవండి

బీజేపీ తరఫున ప్రచారం చేసే వారి జాబితా..

  • నరేంద్ర మోదీ
  • జేపీ నడ్డా
  • రాజ్‌నాథ్ సింగ్
  • అమిత్ షా
  • నితిన్ గడ్కరీ
  • యడ్యూరప్ప
  • లక్ష్మణ్
  • యోగి ఆదిత్యనాథ్
  • పీయుష్ గోయల్
  • నిర్మలా సీతారామన్
  • స్మృతి ఇరానీ
  • పురుషోత్తమ్ రుపాల
  • అర్జున్ ముండా
  • భూపేంద్ర యాదవ్
  • కిషన్ రెడ్డి
  • సాధ్వి నిరంజన్
  • జ్యోతి మురుగన్
  • ప్రకాశ్ జవదేకర్
  • తరుణ్ చుంగ్
  • సునీల్ బన్‌సాల్
  • బండి సంజయ్
  • అర్వింద్ మీనన్
  • డికె అరుణ
  • మురళీధర్ రావు
  • పురంధేశ్వరీ
  • రవి కిషన్
  • పొంగులేటి సుధాకర్ రెడ్డి
  • జితేంద్ర రెడ్డి
  • గరికపాటి మోహన్ రావు
  • ఈటెల రాజేందర్
  • ధర్మపురి అర్వింద్
  • సోయమ్ బాపూరావ్
  • రాజా సింగ్
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • నరసయ్య గౌడ్
  • ప్రేమేందర్ రెడ్డి
  • ప్రదీప్ కుమార్
  • బంగారు శ్రుతి
  • కాసం వెంకటేశ్వర్లు
  • యాదవ్ క్రిష్ణ ప్రసాద్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..