MLA Raja Singh: మరో బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. ఇంతకీ రాజాసింగ్ ఏమన్నారు..?
మళ్లీ మరో వివాదంలో వార్తల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. కేసులు పెట్టేవరకూ వెళ్లింది. ఇంతకీ రాజాసింగ్ ఏమన్నారు?
కాంట్రావర్సీ కేరాఫ్ అడ్రస్ బీజేపీ(BJP) ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). ఇప్పుడు ఆయన మళ్లీ మరో వివాదంలో వార్తల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. కేసులు పెట్టేవరకూ వెళ్లింది. ఇంతకీ రాజాసింగ్ ఏమన్నారు? ఆయన వ్యాఖ్యలపై వివాదం ఎందుకు ? హిందువులు దర్గాలకు వెళ్లొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. హిందు రాజును అవమానించిన చోటుకు హిందువులు ఎందుకు వెళతారనేది ఆయన ప్రశ్న. రాజాసింగ్ ఈ కాంట్రావర్సీ కామెంట్స్‌పై పోలీసులకు ముస్లిం మతపెద్దలు ఫిర్యాదు చేశారు. దీంతో మత విశ్వాసాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. సుపుర్ శర్మను సస్పెండ్ చేసినట్లే రాజాసింగ్‌ను కూడా సస్పండ్ చేయాలని ముస్లిం మతపెద్దలు డిమాండ్ చేశారు. రాజాసింగ్ కామెంట్స్ చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మతపెద్దలు.
ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 228 (ఏ) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదైంది. అత్యాచార బాధిత బాలిక వీడియో, ఫొటోలు బయపెట్టిన కారణంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అమ్నేషియా పబ్ సంఘటకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను, ఒక వీడియోను బయట పెట్టారు. బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియాకు చూపించారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. మైనర్ బాలికకు సంబంధించిన వీడియోలను బహిరంగ పరిచినందుకు గాను రఘునందన్‌పై పలువురు విమర్శలు కూడా చేశారు.
రేప్ కేసుకి సంబంధించి రఘునందన్ వీడియోలు విడుదల చేశారు. ఆ తర్వాత కూడా వరుసగా వీడియోలు వచ్చాయి. బయటికి వస్తున్న వీడియోలను పరిశీలించిన పోలీసులు.. ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీశారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన వీడియోలు బయటికి రిలీజ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు వీగిపోతుందని గట్టిగా వాదిస్తోంది. బాధితురాలి పేరు, వివరాలు వెల్లడించనప్పుడు కేసు ఎలా నిలబడుతుందని అంటోంది.