AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. అరగంట తర్వాత అక్కడ ఒక్క ఫిష్ కనిపిస్తే ఒట్టు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లో చేపల లోడుతో వెళ్తున్న లారీ ఒకటి బోల్తా పడింది. భద్రచలం క్రాస్ రోడ్డు వద్ద తెల్లవారుజామన చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

Viral: చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా.. అరగంట తర్వాత అక్కడ ఒక్క ఫిష్ కనిపిస్తే ఒట్టు..
Fish
Rajitha Chanti
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 07, 2022 | 6:45 PM

Share

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నిస్తుంటారు. కానీ లారీలు, కంటైనర్లు బోల్తా పడినప్పుడు మాత్రం వారికి రక్షించడానికి బదులుగా అందులో ఉండే వస్తువుల కోసం ఎగబడుతుంటారు జనాలు.. ఇదివరకు బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీలు, సెల్ ఫోన్స్, చేపల లోడ్ తో వెళ్తున్న లారీలు రోడ్డుపై బోల్తా పడిన సంఘటనలు చూసే ఉంటాయి. లారీలు బోల్తా పడితే సమీప గ్రామాల్లోని ప్రజలకు పెద్ద పండగే ఇక. గాయపడిన వారి కంటే లారీలోని వస్తువుల కోసం భారీగా రోడ్డుపైకీ చేరుకుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను మనం చూసే ఉంటాం.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలోనూ జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది.. ఇంకేముంది సమీప గ్రామంలో ఉన్న ప్రజలు పండగ చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకుందామా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లో చేపల లోడుతో వెళ్తున్న లారీ ఒకటి బోల్తా పడింది. భద్రచలం క్రాస్ రోడ్డు వద్ద తెల్లవారుజామన చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని చేపలన్నీ చెల్లా చెదురైపోయాయి. ఈ విషయం ఉదయం ఆరుగంటల సమయానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలకు తెలిసిందే. ఇంకేముంది చేపలకోసం స్థానికులు ఎగబడ్డారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రోడ్డుపైకీ చేరుకుని చేపలను పట్టుకెళ్లారు. ఈ క్రమంలో స్థానికంగా వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు ఇబ్బంది కలిగింది. పోలీసులు ఎంత వారించినా పట్టించుకోని స్థానికులు చేపలు ఎత్తుకెళ్లడంలో నిమగ్నమైపోయారు. సుమారు 4వేల చేపలు ఉన్న లారీ లోడ్‌ను అరగంటలో ఖాళీ చేసేసారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెళుతుండగా లారీ ప్రమాదానికి గురైంది.