Telangana: తెలంగాణ రాజకీయాల్లో దుమ్ముదుమారం.. బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..?

|

Apr 16, 2024 | 10:04 PM

గడియకో విమర్శ.. పూటకో ఆరోపణ.. తెలంగాణ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలనేతలు పరస్పరం విసురుకుంటున్న మాటల తూటాలు.. చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌... ఈ మూడు పార్టీల్లో ఎవరెవరికి బ్రదర్స్‌, ఎవరెవరికి ఎనిమీస్‌? అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరు ఎవరితో జంప్‌కాబోతున్నారు, ఎవరు ఎవర్ని జాకీలు పెట్టి లేపుతున్నారు.. ఎవరికోసం ఎవరు సుఫారీ ఇచ్చారు.. ఈ ముచ్చట్లే పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.

గడియకో విమర్శ.. పూటకో ఆరోపణ.. తెలంగాణ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలనేతలు పరస్పరం విసురుకుంటున్న మాటల తూటాలు.. చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌… ఈ మూడు పార్టీల్లో ఎవరెవరికి బ్రదర్స్‌, ఎవరెవరికి ఎనిమీస్‌? అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరు ఎవరితో జంప్‌కాబోతున్నారు, ఎవరు ఎవర్ని జాకీలు పెట్టి లేపుతున్నారు.. ఎవరికోసం ఎవరు సుఫారీ ఇచ్చారు.. ఈ ముచ్చట్లే పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.

తెలంగాణలో జంపింగ్‌ జపాంగ్స్‌కు తోడు.. ఇప్పుడు సుఫారీ, లాలూచీ పాలిటిక్స్‌ కొత్తగా తెరమీదకు వచ్చాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీతో బీఆర్‌ఎస్‌ ఒప్పందం చేసుకుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు.. సంచలనం రేపుతున్నాయి. కూతురి బెయిల్‌ కోసం మోదీతో లాలూచీ పడ్డ కేసీఆర్‌.. ఐదు ఎంపీ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారంటూ నారాయణపేట సభలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి బ్రదర్స్‌ అంటూ.. ఇటీవల టీవీ9 క్రాస్‌ఫైర్‌లో సంచలన కామెంట్స్‌ చేసిన కేటీఆర్‌… తాజాగా మరో బాంబు పేల్చారు.పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించబోతున్నాయన్నారు. 25మంది ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి జంపయిపోతారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

మోదీకి వస్తున్న ఆదరణ చూసి… బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లే కూడబలుక్కున్నాయన్నది కమలనాథుల విమర్శ. ధ్వంసమైన బీఆర్‌ఎస్‌ను ప్రతిరోజూ విమర్శిస్తూ రేవంత్‌ రెడ్డే ఆ పార్టీకి ప్రచారం కల్పిస్తున్నారని .. షెడ్డుకెళ్లిన కారును జాకీలు పెట్టి లేపుతున్నారనీ ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.

ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య… ఎవరు ఎవరికి బ్రదర్స్‌… ఎవరు ఎవరికి బద్ధశత్రువులు అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఎన్నికల నాటికి ఏ మలుపు తీసుకుంటుందో.. ఎవరికి లబ్ధి చేకూరుస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..