Viral: కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
తరచూ పొలాల్లో, ఉపాధిహామీ కూలి పనుల్లో కారి్మకులు తరచూ పాము కాట్లకు గురవుతూ ఉంటారు. ఆ సమయంలో కొందరు సామును చంపేస్తుంటారు. కొందరు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చి పామును సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఇటీవల పాముకాట్లకు గురవుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఉపాధిహామీ కూలి పనులకోసం వెళ్లిన ఓ మహిళ పాముకాటుకు గురైంది.
ములుగు జిల్లా వెంకటాపురం లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఉపాధిహామీ కూలి పనులకు వెళ్లింది. అక్కడ ప్రమదావశాత్తూ పాముకాటుకు గురైంది. కూలి పనులు చేస్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ పాము ఆ మహిళను కాటు వేసింది. అయితే ఆ మహిళ ఏమాత్రం ఖంగారు పడకుండా.. భయపడకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆమె ఒక్కతే వెళ్లలేదు.. పనిలో పనిగా తనను కాటు వేసిన పాముని కూడా తీసుకెళ్లింది. అయితే ఆ పామును సజీవంగా కాకుండా చంపి డబ్బాలో సెట్టుకొని వెటపెట్టుకొని ఆస్పత్రికి వెళ్లింది. శాంతమ్మ చేతిలో పామును చూసి ఖంగు తిన్నారు వైద్యులు. ఎందుకిలా చేశాని అడిగితే తనను ఏ పాము కరిచిందో డాక్టర్లకు తెలియాలి కదా అని చెప్పింది శాంతమ్మ. ఇక ఆలస్యం చేయకుండా శాంతమ్మ తెచ్చిన పాము విషపూరితమైందిగా గుర్తించి వెంటనే చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన నెట్టింట చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాంతమ్మ ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

