Srirama Navami: ఈసీ షాక్..! భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ప్రత్యక్షంగా చూడలేమా..?

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ప్రతి ఏడాది కన్నుల పండువగా వైభవంగా జరిగే ఈ వేడుకలను కోట్లాది మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేవారు. ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా భక్తులకు నిరాశే మిగిలింది.

Srirama Navami: ఈసీ షాక్..! భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ప్రత్యక్షంగా చూడలేమా..?
Sri Sitharama Kalyanam
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 16, 2024 | 6:48 PM

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ప్రతి ఏడాది కన్నుల పండువగా వైభవంగా జరిగే ఈ వేడుకలను కోట్లాది మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేవారు. ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా భక్తులకు నిరాశే మిగిలింది.

భద్రాద్రి క్షేత్ర ప్రాముఖ్యత, కళ్యాణ వేడుక దృష్ట్యా శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. ఈ అభ్యర్థనను ఏప్రిల్ 4వ తేదీనే ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.

అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసింది. తమ ప్రభుత్వ అభ్యర్థనను పున: పరిశీలించాలని ఏప్రిల్ 6వ తేదీన లేఖ రాసింది. నేరుగా వైకుంఠం నుంచి వచ్చి కొలువు దీరిన చతుర్భుజ రామునిగా దక్షిణ భారత దేశంలో అపూర్వమైనదిగా కొలిచే భద్రాద్రి రాముని వేడుకలు అత్యంత ప్రాధాన్యమైనవని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని కోరింది.

1987 నుంచి ప్రత్యక్ష ప్రసారం ఆనవాయితీగా వస్తోందని, 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ లైవ్ ఇచ్చిందని, రేడియో ద్వారా కళ్యాణ మహోత్సవ వ్యాఖ్యానం ప్రసారమైందని ప్రభుత్వం ఇదే లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కోట్లాది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం రెండోసారి చేసిన అభ్యర్థనకు ఈసీ నుంచి మంగళవారం వరకు స్పందన రాలేదు.

మరిన్ని ఆధ్యాత్మక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…