Amarnath Yatra 2024: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ.. ఎలా అప్లై చేసుకోవాలి.. ఎవరు అనర్హులో పూర్తి వివరాలు..
అమర్‌నాథ్ యాత్ర 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కొక్కరికి రూ. 150గా నిర్ణయించబడింది. అమర్‌నాథ్ యాత్ర 2024 కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను వెబ్‌సైట్‌లో పేర్కొన్న బ్యాంక్ శాఖల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే సన్నాహాల్లో ఉండి పేరు నమోదు చేసుకోవాలనుకుంటే.. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అధికారిక వెబ్‌సైట్ jksasb.nic.in లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇంట్లో కూర్చొనే అమర్‌నాథ్ యాత్రకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర.. మీరు కూడా ఇప్పుడు మంచు కొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకోవడానికి అమర్‌నాథ్ యాత్ర చేయాలని ప్లాన్ చేస్తుంటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. మంచుతో కప్పబడి కొన్ని నెలల పాటు మూసి ఉన్న అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకోవాలనుకునే భక్తుల నిరీక్షణ ముగిసింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ( ఏప్రిల్ 15, 2024) ప్రారంభమైంది. అంతేకాదు అమర్‌నాథ్ యాత్ర 29 జూన్ 2024 నుంచి ప్రారంభంకానుంది.
అమర్‌నాథ్ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమైంది. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) వెబ్‌సైట్ ప్రకారం.. అమర్‌నాథ్ ఆలయానికి వార్షిక తీర్థయాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమై ఆగస్టు 19వ తేదీ 2024తో ముగుస్తుంది.
అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఫీజు
అమర్‌నాథ్ యాత్ర 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కొక్కరికి రూ. 150గా నిర్ణయించబడింది. అమర్‌నాథ్ యాత్ర 2024 కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను వెబ్‌సైట్‌లో పేర్కొన్న బ్యాంక్ శాఖల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే సన్నాహాల్లో ఉండి పేరు నమోదు చేసుకోవాలనుకుంటే.. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అధికారిక వెబ్‌సైట్ jksasb.nic.in లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇంట్లో కూర్చొనే అమర్‌నాథ్ యాత్రకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలంటే..
ముందుగా శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు jksasb.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఇక్కడ మెనూ వారీగా ఇచ్చిన ‘ ఆన్‌లైన్ సర్వీస్’కి వెళ్లి క్లిక్ చేయండి.
దీని తర్వాత యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి .
దీని తర్వాత.. అంగీకరిస్తున్నాను అనే కాలమ్ ను టిక్ చేసి నమోదుపై క్లిక్ చేయండి .
దీని తర్వాత భక్తులు తమకు సంబంధించిన అన్ని వివరాలను పూర్తి చేయాలి. అనంతరం సబ్మిట్ చేయాలి. ఆపై నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTPని ఎంట్రీ చేసిన అనంతరం దరఖాస్తుకు సంబంధించిన డబ్బులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
దీంతో సక్సెస్ ఫుల్ గా అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇప్పుడు చివరకు ప్రయాణ అనుమతిని డౌన్‌లోడ్ చేసుకోండి. తద్వారా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి.
హెల్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు, 8 ఏప్రిల్ 2024న లేదా ఆ తర్వాత ప్రభుత్వం గుర్తించిన వైద్యుడు ఇచ్చిన హెల్త్ సర్టిఫికెట్ తప్పని సరి. ప్రభుత్వ గుర్తింపు ఆసుపత్రిలో మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు హెల్త్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉన్న భక్తుల రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. CHC జారీ చేసిన హెల్త్ ఫిట్ నెస్ లేకుండా అమర్‌నాథ్ యాత్రకు దరఖాస్తు చేయలేరు.
ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే
దేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్‌లకు చెందిన 540 బ్రాంచ్‌లలో రిజిస్ట్రేషన్ చేస్తారు. అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులకు ప్రతి దరఖాస్తుదారు ఫోటో, యాత్రికుడికి రూ. 250 యాత్ర రిజిస్ట్రేషన్ ఫీజు, గ్రూప్ లీడర్ పేరు, మొబైల్ ఫోన్ నంబర్, ఇమెయిల్‌తో సహా చిరునామా అవసరం.
పోస్టల్ ఛార్జీలు 1 నుంచి 5 వరకు రూ.50, 6 నుంచి 10 వరకు భక్తులకు రూ.100, 11 నుంచి 15 వరకు రూ.150, 16 నుంచి 20 వరకు రూ.200, 21 నుంచి 25 వరకు రూ.250, రూ.26 నుంచి 30 వరకు రూ.300 అవుతుంది. అంతేకాదు ఏప్రిల్ 8 తర్వాత ఆరోగ్య ధృవీకరణ పత్రం ఉంటేనే యాత్ర రిజిస్ట్రేషన్ అవుతుంది. అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, పోస్టల్ ఛార్జీలను శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రానికి సంబంధించిన చీఫ్ అకౌంట్ ఆఫీసర్‌కు పంపాలి.
ఇంట్లో కూర్చొని అమరనాథుడి దర్శనం
జూన్ 29న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన వెంటనే బాబా బర్ఫానీ పవిత్ర గుహ నుంచి ఉదయం, సాయంత్రం ఇచ్చే హారతిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ హారతిని అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే దర్శించుకోవచ్చు.
అమర్‌నాథ్ యాత్రకు వయోపరిమితి
అమర్‌నాథ్ యాత్ర కోసం నమోదు చేసుకునే ముందు ఎవరైనా సరే శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి యాత్రకు సంబంధించిన నియమాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అమర్‌నాథ్ యాత్రలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు పాల్గొన లేరు. గర్భిణీ స్త్రీలు, బైపాస్ సర్జరీ లేదా స్టెంటింగ్ చేయించుకున్న గుండె జబ్బులకు సంబంధించినవారు కూడా ఈ యాత్రకు అనుమతి ఇవ్వరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..