- Telugu News Photo Gallery Doing this on Sri Rama Navami brings peace and happiness in the house, Check Here is details in Telugu
Astro Tips: శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి..
ఇంట్లో ఎలాంటి గొడవలు, తగాదాలు, ఆందోళన, గందర గోళం, ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఇంట్లో మానసిక ప్రశాంత, శాంతి, సంతోషం ఉంటే.. ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. ఇంట్లోని, జీవితంలో మంచి జరిగేందుకు రాముడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ ఏడాది శ్రీరామ నవమి ఏప్రిల్ 17వ తేదీ అంటే.. బుధవారం వచ్చింది. ఈ రోజున కొన్ని పనులు చేస్తే..
Updated on: Apr 16, 2024 | 5:00 PM

ఇంట్లో ఎలాంటి గొడవలు, తగాదాలు, ఆందోళన, గందర గోళం, ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఇంట్లో మానసిక ప్రశాంత, శాంతి, సంతోషం ఉంటే.. ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు.

ఇంట్లోని, జీవితంలో మంచి జరిగేందుకు రాముడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ ఏడాది శ్రీరామ నవమి ఏప్రిల్ 17వ తేదీ అంటే.. బుధవారం వచ్చింది. ఈ రోజున కొన్ని పనులు చేస్తే.. ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు.

ఏదైనా రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయండి. అలాగే పసుపు ఆహారాన్ని సమర్పించండి. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే.. ధనలాభం కలుగుతుంది. నవమి రోజున రామాయణం పఠించడం, హనుమంతుడిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

అలాగే శ్రీరామ నవమి రోజు కొన్ని మంత్రాలను పఠించడం వల్ల కూడా శ్రీరాముడి ఆశీస్సులు మీపై ఉంటాయి. ఏదైనా రామాయంలో కూర్చుని 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్ర నామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే' ఇలా 108 సార్లు పఠిస్తే.. అన్ని రకాల శుభాలు జరుగుతాయి.

రామ నవమి రోజు పేదలకు అన్నాదానం, వస్త్రాదానం చేస్తే..ఎంతో మంచిది. రాముడికి పసుపు బట్టలు అంటే ఎంతో ప్రీతి. రామాలయంలో పసుపు బట్టలు ఇవ్వండి. రాముడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. మీ కష్టాలన్నీ తొలగుతాయి.





























