Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన టికెట్ల పంచాయతీ.. బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌

| Edited By: Ram Naramaneni

Aug 18, 2023 | 10:04 PM

అసెంబ్లీ ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లైఫ్‌ అండ్‌ డెత్‌గానే చూస్తోంది.. గెలుపు కోసం హైకమాండ్‌ నుంచి పీసీసీ దాకా పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా ఆశావహుల నుంచి ధరఖాస్తులు తీసుకుంటోంది. ఇప్పటిదాకా టికెట్లు ఎవరికీ ఫిక్స్ చేయలేదని.. ఇక మీదట సర్వేలు చేసిన తర్వాత నివేదికలు అధిష్టానం వద్దకు వెళతాయంటున్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగానే కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన వారికే కన్ఫామ్‌ అవుతుందన్నారు రేవంత్‌ రెడ్డి...

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన టికెట్ల పంచాయతీ.. బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌
Big News Big Debate
Follow us on

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల పంచాయితీ మొదలైంది.. లైఫ్‌ అండ్‌ డెత్‌గా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలనుకుంటున్న పార్టీ.. ఆశావహుల నుంచి ధరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. సర్వేలు, సత్తానే ప్రామాణికం అంటున్న పీసీసీ నాయకులు.. రెబల్‌ సవాళ్లను అధిగమిస్తారా.. ప్రతిజ్ఞ పేరుతో సంతకాలు అసమ్మతిని కట్టం చేస్తాయా..

అసెంబ్లీ ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లైఫ్‌ అండ్‌ డెత్‌గానే చూస్తోంది.. గెలుపు కోసం హైకమాండ్‌ నుంచి పీసీసీ దాకా పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా ఆశావహుల నుంచి ధరఖాస్తులు తీసుకుంటోంది. ఇప్పటిదాకా టికెట్లు ఎవరికీ ఫిక్స్ చేయలేదని.. ఇక మీదట సర్వేలు చేసిన తర్వాత నివేదికలు అధిష్టానం వద్దకు వెళతాయంటున్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగానే కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన వారికే కన్ఫామ్‌ అవుతుందన్నారు రేవంత్‌ రెడ్డి. అయితే పార్టీకి ఉన్న అతిపెద్ద సవాలే అభ్యర్ధుల ఎంపిక. టికెట్లు రాలేదని ఆఫీసులు తగలబెట్టిన చరిత్ర కూడా ఈ పార్టీకుంది. దీంతో ఈ సారి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

అంతేకాదు ధరఖాస్తులోనే ప్రతిజ్ఞలు కూడా చేయిస్తుంది. ఇది ఎంతవరకూ కాపాడుతుందో కానీ.. పార్టీలో అలజడి మాత్రం మొదలైంది. టికెట్ల కోసం గాంధీభవన్‌ కు కేడర్‌ భారీగా వస్తున్నారు. ఇక పార్టీలో చక్రం తిప్పిన సీనియర్లు కూడా ఇప్పుడు టికెట్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పొన్నాల వంటి సీనియర్లు ఢిల్లీలో మెట్లు ఎక్కుతున్నారు. నాగం జనార్దన్‌ రెడ్డి ఇప్పటికే తన ఆవేదన బయటపెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జోష్‌ ఉంది.. అభ్యర్ధుల ఎంపికలోనూ స్టెప్‌బై స్టెప్ కనిపిస్తోంది. మరి ఈ డిసిప్లేన్‌ కడదాకా ఉంటుందా? రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలే పార్టీ వీడుతున్నారు.. ధరఖాస్తులో చేసిన ప్రతిజ్క్షకు విలువ ఇస్తారా? లాంటి అంశాలపై బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌..

ఇవి కూడా చదవండి

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..