Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో జులై 2 టెన్షన్‌.. చివరికి ఖమ్మం సభలో ఏం జరగనుంది..

Congress Khammam Meeting: తెలంగాణ కాంగ్రెస్‌కి మరో టెన్షన్‌ పట్టుకుంది. జూలై 2న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగసభపై తర్జనభర్జన పడుతోంది. ఓవైపు భట్టి పాదయాత్ర ముగింపు..మరోవైపు పొంగులేటి చేరిక ఒకే వేదికపైనేనా ఉండాలా..? వేర్వేరుగా చేయాలా..? అనే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోందట.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో జులై 2 టెన్షన్‌.. చివరికి ఖమ్మం సభలో ఏం జరగనుంది..
Bhatti Vikramarka, ponguleti srinivas reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 28, 2023 | 7:19 AM

Congress Khammam Meeting: కర్నాటక ఫలితాలతో జోష్‌ మీదున్న తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్‌ మొదలైంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రతో ఆ పార్టీకి మరింత ఊపొచ్చింది. జూలై 2వ తేదీన భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి, ముఖ్యఅతిథులుగా రాహుల్, ప్రియాంకగాంధీలను ఆహ్వానించాలని భావిస్తోంది. ఇక్కడివరకూ బాగానే ఉంది. అయితే, అదే రోజు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు నాలుగు నెలల నుంచి మండుటెండల్లో భట్టి పాదయాత్ర నిర్వహించి, పార్టీని అధికారంలోకి తేవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ఈ సమయంలో భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపుగా ప్రత్యేక సభ ఉండాల్సిందేనని సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. భట్టికి మైలేజ్‌ వెళ్లకుండా మమ అనిపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవర్గం నేతలు మాత్రం పొంగులేటి సభలోనే భట్టిని సన్మానిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అయితే, భట్టి పాదయాత్ర ముగింపు సభకు రాహుల్‌ లేదా ప్రియాంకగాంధీ హాజరయ్యే ఛాన్స్‌ ఉంది. ఈ విషయంపై నిన్న కాంగ్రెస్‌ స్ట్రాటజీ మీటింగ్‌లో కూడా చర్చ జరిగింది. అదే సమయంలో ఖమ్మంలో భట్టి ముగింపు సభ, పొంగులేటి చేరిక విషయాన్ని కూడా కొందరు సీనియర్‌ నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో పీపుల్స్‌ మార్చ్‌ వర్సెస్‌ పొంగులేటి చేరికగా రెండు వర్గాలుగా మారిపోయాయి. దాంతో రాహుల్‌ కంప్లయింట్స్‌ వద్దే వద్దు.. పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పండి..గతంలో ఇదే చెప్పాను..మీడియా ముందు పార్టీ ఇంటర్నల్‌ ప్రాబ్లమ్స్‌ మాట్లడొద్దని సీరియస్‌ అయ్యారు. ఏదైనా ఉంటే ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ దగ్గర చెప్పుకోవాలని రాహుల్‌ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఖమ్మం SR గార్డెన్‌ పక్కన దాదాపు వంద ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4 లక్షల మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది హస్తం పార్టీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..