Mallu Bhatti Vikramarka: ‘ బీఆర్ఎస్ ఉన్న ఉద్యోగాలే భర్తీ చేయలేదు’.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌పై భట్టి ఏమన్నారంటే?
టీవీ9 మెగా కాన్‌క్లేవ్ వేదికగా సీఎం పదవిపై కీలక కామెంట్స్ చేశారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. దళిత సీఎం అని తాను ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. సీఎం పదవి, ప్రమాణస్వీకారం అంటూ రేవంత్‌రెడ్డి చేస్తోన్న స్టేట్‌మెంట్స్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక... ప్రొగ్రెస్, స్కాంగ్రెస్ అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భట్టి
టీవీ9 మెగా కాన్‌క్లేవ్ వేదికగా సీఎం పదవిపై కీలక కామెంట్స్ చేశారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. దళిత సీఎం అని తాను ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. సీఎం పదవి, ప్రమాణస్వీకారం అంటూ రేవంత్‌రెడ్డి చేస్తోన్న స్టేట్‌మెంట్స్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక… ప్రొగ్రెస్, స్కాంగ్రెస్ అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భట్టి. కేసీఆర్ పాలనపై హాట్ కామెంట్స్ చేశారు భట్టి. ఎక్కడ చూసినా అవినీతే రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్‌ది హైప్ కాదు. కచ్చితంగా గెలవబోతోందన్నారు భట్టి. ఎందుకు కాంగ్రెస్ గెలవబోతుందో టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో వివరించారు. సీఎం పదవిపై కీలక కామెంట్స్ చేశారు భట్టి. దళిత సీఎం అని తాను ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రజలు దంచుడే.. బీఆర్‌ఎస్‌ను దించుడే అన్నారు భట్టి. ‘నా సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో వర్గాలను కలిసాను కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో న్యాయం జరగలేదన్నదే అందరి భావన. గ్రూప్-1 పరీక్షకు దశాబ్దం ఎదురుచూడాల్సిన పరిస్థితి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా విఫలమయింది. కొత్త ఉద్యోగాలు కాదు..ఉన్న ఉద్యోగాలే భర్తీ చేయలేదు. గత ప్రభుత్వాల కృషివల్లే ఐటీ అభివృద్ధి జరిగింది. ఐటీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు’. ఎస్సీ వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ తీర్మానం చేసింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు చేయలేదు’ అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..