Telangana: ఆధార్ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా..?.. తస్మాత్ జాగ్రత్త!!
చాలా చోట్ల ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు విత్ డ్రా చేసే విధానం అమల్లో ఉంది. కొన్ని ఊర్లలో సీనియర్ సిటిజన్స్ చాలామంది ఈ విధానం వల్లే నగదు విత్ డ్రా చేస్తున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు ఒక కొత్త వ్యూహానికి తెర లేపారు. ఆధార్ నంబర్ని కేంద్రంగా చేసుకొని, నకిలీ ఫింగర్ ప్రింట్ సృష్టించి బ్యాంకుల నుండి డబ్బు విత్ డ్రా చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనక ఇంకా పెద్ద ముఠా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

చాలా చోట్ల ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు విత్ డ్రా చేసే విధానం అమల్లో ఉంది. కొన్ని ఊర్లలో సీనియర్ సిటిజన్స్ చాలామంది ఈ విధానం వల్లే నగదు విత్ డ్రా చేస్తున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు ఒక కొత్త వ్యూహానికి తెర లేపారు. ఆధార్ నంబర్ని కేంద్రంగా చేసుకొని, నకిలీ ఫింగర్ ప్రింట్ సృష్టించి బ్యాంకుల నుండి డబ్బు విత్ డ్రా చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనక ఇంకా పెద్ద ముఠా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న సేల్ డీడ్ పత్రాలల్లోని ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నెంబర్ ను దొంగలించి వాటి ద్వారా ఆన్‌లైన్ నగదు విత్ డ్రా చేస్తున్నారు. అయితే ఈ ముఠా సభ్యులకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న కొంతమంది సిబ్బంది కూడా సహకరించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం వారి పాత్ర పైన కూడా సిఐడి పోలీసులు ఆరా తీస్తున్నారు. సెల్ డీడ్ నుండి ఫింగర్ ప్రింట్స్ ను కట్ చేసుకుని, ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆర్టిఫిషియల్ గా తయారయ్యే వేలిముద్రలను తయారు చేస్తున్నారు. సిలికాన్ తో తయారు చేయబడిన ఫింగర్ ప్రింట్స్ వాడుతూ దాని ద్వారా ఆధార్ నoబర్ జత చేసి నగదు దోచేస్తునారు..
ఎలా వెలుగులోకి వచ్చిందంటే??
హైదరాబాదులో పని చేసే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఖాతా నుండి ఈ తరహాలోనే మూడు దఫాల్లో డబ్బులు విత్‌డ్రా చేశారు నిందితులు.. అనుమానం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. తనకు తెలియకుండానే తన ఖాతా నుండి 24 వేల రూపాయలు విత్‌డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన అధికారులకు అసలు నిజం తెలిసింది. ఫింగర్ ప్రింట్ ద్వారానే డబ్బులు విత్ డ్రా అయినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే తాను ఎక్కడ ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు చేయలేదని బాధితుడు చెప్పటంతో పోలీసులు మరో కోణంలో దీన్ని విచారించారు. డబ్బులు విత్ డ్రా చేయబడిన లొకేషన్ నుండి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితులు తయారు చేసిన ఆర్టిఫీషియల్ ఫింగర్, ప్రింట్స్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసినట్టు పోలిసులు గుర్తించారు. ఐతే ఇటీవల తాను ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పోలీసులకు తెలిపాడు బాధితుడు. రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ లో వేలిముద్రలు ఇచ్చినట్టు పోలీసులకు తెలుపటంతో వాస్తవం బయటపడింది.




ఫింగర్ ప్రింట్స్ తయారు చేసిన ఇద్దర్ని అరెస్టు చేసిన సీఐడీ
ఇలా ఫింగర్ ప్రింట్స్ ని తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సిఐడీ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ కు చెందిన రంజిత్ అనే వ్యక్తితోపాటు బెంగళూరుకు చెందిన అలం అనే వ్యక్తిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే భారీ ముఠాలో వీరు ఇద్దరు సభ్యులు మాత్రమే .. మిగతా ముఠా సభ్యులకు పోలీసులు గాలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కార్యాలయ సిబ్బంది పైన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రంగా ఉండాల్సిన సేల్ డెడ్ పత్రాలను నిందితులకు కట్టబెట్టిన వ్యక్తులను గుర్తించి పనిలో ఉన్నారు పోలీసులు.