చీకట్లో దర్శనమిస్తున్న వింత ఆకారాలు.. రాత్రి 8 దాటితే గజగజ వణికిపోతున్న జనాలు!
ఆ ప్రాంతంలో రాత్రి 8 దాటితే ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కు మంటూ రోజులు గడుపుతున్నారు. పగటిపూట పిల్లలను బయటకు పంపాలన్న కూడా ధైర్యం చేయట్లేదు. ఇంతకూ వీళ్లు ఇంతలా భయపడుతున్నది ఎందుకో తెలుసా..అయితే తెలుసుకుందాం పదండి.

కరీంనగర్ సిటి వేగంగా అభివృద్ధి చెందుతుంది.. నగర జనాభా పెరుగుతుంది.. దానికి తోడు శివారు కాలనీలు. ఇప్పుడు ముఖ్యమైన సెంటర్‌గా మారిపోయాయి. ఈ క్రమంలోనే శాతవాహన యూనివర్సిటితో పాటు రేకుర్తి, విజయ పురికాలనీ, వికలాంగుల కాలనిలో.. ఎలుగు బంటి సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న ఎలుగుబంటి స్ధానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. స్థానికంగా 200 ఎకరాల్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో దట్టమైన చెట్ల పొదలతో పాటు చిన్న పాటి కొండలు ఉన్నాయి. ఇవే ఈ ఎలుగు బంట్లకు అవాసాలుగా మారాయి. అదే విధంగా రేకుర్తి శివారులో ఉన్న ఎత్తైన కొండలు కూడా ఎలుగు బంటికి మంచి స్థావరంగా మారాయి. దీంతో ఈ ఎలుగు తరచూ జనావాల్లోకి వస్తూ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఇప్పుడే కాదు గతంలోనూ ఈ ఎలుగుబంటి శాతవాహన వర్సిటీలోకి దూరి నానా హంగామా చేసింది. విద్యార్థులను భయంబ్రాంతులకు గురిచేస్తూ పరుగులు పెట్టించింది. అదే విధంగా రేకుర్తిలోనూ ఒక రోజంతా హడావిడి చేసింది.. అటవి శాఖ అధికారులు అతి కష్టం మీద ఈ ఎలుగును పట్టుకున్నారు. అయితే ఇదే కాకుండా ఇక్కడ మరో రెండు, మూడు ఎలుగుబంట్లు కూడా ఇక్కడ ఉన్నాయని అటవి ‘ శాఖ అధికారులు గుర్తించారు. ఒకదాన్ని పట్టుకున్నప్పటికి మిగతా ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. కోళ్లను మింగి అక్కడే తిష్ట వేసిన కొండచిలువ.. తృటిలో తప్పించుకున్న
తాజాగా రెండ్రోజుల క్రితం కూడా వికలాంగుల కాలనీకి ఎలుగుబంటి సంచరించింది. ఓ పాడుబడిన ఇంట్లో చొరబడి రెండు గంటల పాటు అక్కడే తిష్టవేసింది. చివరకు అటవీశాఖ అధికారులు, పోలీసులు వచ్చి దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేయడంతో.. మెల్లగా అక్కడి నుంచీ జారుకుంది. అయితే ప్రస్తుతానికి అది ఇక్కడి నుంచి వెళ్లిపోయినా.. ఏదో సమయంలో మళ్లీ అది జనావాసాల్లోకి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. దీంతో రాత్రి 8 దాటితే.. ఎవరు భయటకు రావడం లేదు. అదే విధంగా.. పిల్లలకు బయటకు పంపించడం లేదు.. రాత్రే కాదు ఉదయం పూట కూడా ఎలుగు బంటి సంచారంతో స్థానికులు వణికిపోతున్నారు. ఈ ఎలుగు బంటి ఎప్పుడు.. ఎక్కడికి వస్తుందనే ఆందోళన చెందుతున్నారు నగర వాసులు.. ఎలుగు బంటి కనబడిన వెంటనే… బంధించి.. వేరే అట’వి ప్రాంతంలో వదిలిపెట్టాలని కోరుతున్నారు.
వీడియో చూడండి…
ఇది కూడా చదవండి.. అక్కడెలా పెట్టావు బ్రో.. ఇంటి కాంపౌండ్ గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి
మరిన్ని తెలంగాణవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




