AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HCU భూములపై సుప్రీం కోర్టులో బీ ద చేంజ్ సంస్థ పిటిషన్ దాఖలు!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విలువైన పచ్చదనాన్ని కాపాడేందుకు బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. యూనివర్సిటీ భూమిని రక్షిత అడవిగా గుర్తించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అరుదైన వృక్షజాలం, జంతుజాలం ఉన్న ఈ ప్రాంతాన్ని నిర్మాణాల కారణంగా నాశనం కాకుండా కాపాడాలని కోరారు.

HCU భూములపై సుప్రీం కోర్టులో బీ ద చేంజ్ సంస్థ పిటిషన్ దాఖలు!
Hcu
SN Pasha
|

Updated on: Apr 18, 2025 | 1:09 PM

Share

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ మరోసారి న్యాయపోరాటానికి దిగింది. యూనివర్శిటీ పరిధిలోని పలు ఎకరాల భూమిని రక్షిత అడవిగా గుర్తించాల్సిన అవసరం ఉందని కోరుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సొసైటీ అధ్యక్షుడు రామ్ కల్యాణ్ చల్ల నేతృత్వంలో దాఖలైన ఈ పిటిషన్‌లో, ప్రస్తుతం యూనివర్శిటీ పరిధిలో ఉన్న అడవి ప్రాంతాన్ని నిర్మాణాలు, అభివృద్ధి పేరిట నాశనం చేయడంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమిలో పలు అరుదైన వృక్షజాలం, పక్షులు, వన్యప్రాణులు నివసిస్తున్నాయని, అంతేకాకుండా ఇది విద్యార్థులకు, పరిశోధకులకు జీవ పరిసరాల అధ్యయనానికి అనువైన ప్రాంతమని పిటిషన్ పేర్కొంది.

ఈ భూమిని వాణిజ్యాభివృద్ధి, లేదా ఇతర విధాల వినియోగించడాన్ని అడ్డుకునేలా కోర్టు జోక్యం అవసరమని, భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని బీ ద చేంజ్ సంస్థ వాదించింది. ఈ పిటిషన్‌లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, UGC, HCU యాజమాన్యాన్ని ప్రతివాదులుగా చేర్చారు. యూనివర్శిటీ అభివృద్ధి విద్య, పరిశోధన పరంగా ఉండాలని, కాకపోతే ప్రకృతి నాశనం చేసి నిర్మాణాల పేరుతో మౌలిక వసతుల అభివృద్ధి జరగకూడదని స్పష్టం చేశారు. పర్యావరణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు, పౌరసంఘాలు ఈ పిటిషన్‌కు మద్దతు తెలుపుతున్నాయి. “ప్రగతికి పర్యావరణ పరిరక్షణ అనేది విరుద్ధం కాదు – రెండూ పరస్పరంగా సమతుల్యంగా ఉండాలి” అని రామ్ కల్యాణ్ గారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి